ట్రాఫిక్ చలానాలు ఎగ్గొట్టిన బాలయ్య, పవన్, మహేశ్…

Share Icons:

హైదరాబాద్, 12 జనవరి:

టాలీవుడ్ హీరోలు నందమూరి బాలకృష్ణ, మహేశ్‌బాబు, పవన్ కల్యాణ్‌లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి చలానాలు కట్టలేదని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. వేగంగా వాహనం నడపటం, సిగ్నల్స్ జంపింగ్ లాంటి కేసుల్లో వీరి పేర్లు నమోదయ్యాయని వారు తెలిపారు. అయితే.. ఆ సమయంలో కారుని డ్రైవర్లు నడిపి ఉండొచ్చని, కానీ ఫైన్ వేసినప్పుడు కట్టాల్సిన బాధ్యత మాత్రం కారు ఓనరు మీదే ఉంటుందని అన్నారు.

మహేశ్ బాబుకు గత మూడేళ్లలో ఏడు చలానాలు జారీఅయ్యాయి. ప్రిన్స్ పేరుతో ఉన్న కారు నంబర్ ఏపీ 09 సిఎం 4005పై మొత్తం రూ.8,745 జరిమానా చెల్లించాల్సి ఉంది. బాలకృష్ణ కూడా అతివేగంతో కారును నడపడంతో ఓ చలానా జారీ అయింది. హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ లో చెన్నమ్మ హోటల్ వద్ద బాలయ్య పేరుపై ఉన్న ఏపీ 36 క్యూ 0001 కారు అతివేగంతో దూసుకెళ్లడంతో అధికారులు రూ.1,035 జరిమానా విధించారు. పవన్ కల్యాణ్ (కారు నంబరు ఏపీ 09 సీజీ 7778) మూడు చలానాల కింద రూ.505 బకాయి పడ్డారు.

ఇక వీరితో పాటు హీరో నితిన్ రెడ్డి రూ.1,035.. సునీల్ రూ.4,540లు ఫైన్ చెల్లించాల్సి ఉందని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. 

మామాట: కోట్లు సంపాదిస్తున్నారు…చలానాలు కట్టకపోతే ఎలా హీరోలు….

Leave a Reply