నేడు రష్యా అధ్యక్షుడితో భేటీ కానున్న మోదీ…

today PM modi meets Russia president Vladimir putin
Share Icons:

మాస్కో, 21 మే:

భారత్-రష్యా  దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, అలాగే అంతర్జాతీయ పరిణామాలపై నేడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భారత్ ప్రధాని మోదీ భేటీ అయ్యి చర్చించనున్నారు.

తను  జరిపే  చర్చలు  భారత్-రష్యా  దేశాల మధ్య  వ్యూహాత్మక  భాగస్వామ్యానికి  మరింత  బలం  పెంచుతాయని మోదీ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.

ఇక భారత్‌తో స్నేహపూర్వకంగా  ఉండే  రష్యా  ప్రజలకు  నమస్కారం  అంటూ ఆయన ట్వీట్ చేశారు.  పుతిన్‌ను  ఎప్పుడు  కలుసుకున్నా తనకు  సంతోషంగా  ఉంటుందన్నారు.

సోమవారం(మే-21) రష్యా వెళ్లిన మోదీ… సోచి  నగరంలో  పుతిన్‌తో  అనధికారిక  సదస్సులో  పాల్గొంటారు.  ఇరాన్  అణు ఒప్పందం  నుంచి  అమెరికా  తప్పుకోవడం,  ఉగ్రవాదం,  త్వరలో జరగనున్న  ఎస్‌సి‌ఓ,  బ్రిక్స్   సదస్సులు,  అంతర్జాతీయ అంశాలపై  ఇరువురి మధ్య చర్చలుంటాయని సమాచారం.  రక్షణ రంగంలో  రష్యాపై  అమెరికా  ఆంక్షలపైనా  మాట్లాడే అవకాశముంది.

అలాగే ఆఫ్ఘనిస్థాన్,  సిరియా పరిస్థితులపైనా  మోదీ-పుతిన్  మాట్లాడుకుంటారని  రష్యాలో  భారత అంబాసిడర్  పంకజ్ శరన్  తెలిపారు. సోచి  టైమ్ ప్రకారం మధ్యాహ్నం 1 గంటకు  చర్చలు మొదలవుతాయి.  ఇక గత నెలలో  చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ తోనూ మోదీ అనధికారిక  సదస్సులో  పాల్గొన్నారు.

మామాట: అన్నీ అనధికార సమావేశాలేనా…మోదీజీ

Leave a Reply