నేడే ఐక్యరాజ్యసమితి దినోత్సవం

Share Icons:

 న్యూయార్క్, అక్టోబర్ 24, 

ఐక్యరాజ్యసమితి(United-Nations) దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఐక్యరాజ్యసమితి స్థాపించబడిన అక్టోబరు 24వ తేదీన జరుపుకుంటారు. దీన్ని UN Day అని కూడా అంటారు. అంటే యునైటెడ్ నేషన్స్ డే అనమాట. ప్రపంచ శాంతికోసం వివిధ దేశాల మధ్య శాంతి, సామరస్యం సాధించడం కోసం ఏర్పడింది United-Nations. యునైటెడ్ నేషన్స్ డే అనేది అక్టోబరు 20 నుండి 26 వరకు జరిగే ఐక్యరాజ్యసమితి వారోత్సవాలలో వచ్చే ఒక రోజు.

1948లో ‘ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ’ అక్టోబరు 24ను ఐక్యరాజ్యసమితి చార్టర్ వార్షికోత్సవంగా ప్రకటించింది. ఇది ప్రపంచ ప్రజలకు ఐక్యరాజ్యసమితి లక్ష్యాలను, సాధించిన విజయాలను తెలియజేసి వారి మద్దతును పొందడానికి కృషి చేస్తుంది. 1971లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఐక్యరాజ్యసమితి దినోత్సవాన్ని అంతర్జాతీయ సెలవు దినంగా ప్రకటించింది (ఐక్యరాజ్యసమితి రిజల్యూషన్ 2782). దీన్ని అన్ని ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు పబ్లిక్ సెలవు రోజుగా గుర్తించాలని సిఫార్సు చేసింది. 

ఈ ఏడాది (2018) ఐక్యరాజ్యసమితి దినోత్సవం సందర్భంగా, సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్స్ ఈ సందర్భంగా.. ఐక్యరాజ్యసమితికి చెందిన స్త్రీ,పురుషులను ప్రోత్సహిస్తూ, ప్రపంచంలోని పలు సవాళ్లను ఎదుర్కొనేందుకు “ఎన్నటికీ విడిచిపెట్ట వద్దు”  “never give up” అనే సందేశం పంపారు.  ఐక్యరాజ్యసమితిని రెండవ ప్రపంచయుద్ధం తరువాత స్థాపించారు, దీని ముఖ్య ఉద్దేశం ప్రపంచ శాంతి సాధించడం.

అందుకే గుటెర్స్… ఈ రోజున మనం మళ్లీ.. విరిగిన నమ్మకాలను పునరుద్దరించడానికి, రోజు రోజూ గాయపడుతున్న భూమికి చికిత్స చేయడానికి, అందరిని కలుపుకొని వెళ్లడానికి, ప్రతివ్యక్తి గౌరవం కాపాడడానికి ప్రమాణం చేద్దామన్నారు.

మామాట : పర్యావరణ పరిరక్షణకు మనం కూడా కృషి చేద్దాం …

Leave a Reply