మోహన్ బాబు ధర్నా

Share Icons:

తిరుపతి, మార్చి 22,

కాలేజీ ఫీజు చెల్లింపు విషయం రాజకీయ రంగు పులుముకుంది. గత కొంతకాలంగా దీనిపై మీడియాకెక్కిన నటుడు, విద్యానికేతన్ యజమాని మోహన్ బాబు నేడు రోడ్డెక్కారు.. వివిరాలు.. క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు, ఆయ‌న త‌నయుడు మంచు మ‌నోజ్ తిరుప‌తి-మ‌ద‌న‌ప‌ల్లి రోడ్డుపై బైఠాయించి నిర‌స‌న తెలుపుతున్నారు. శ్రీ విద్యానికేత‌న్ య‌జ‌మాని అయిన మోహ‌న్ బాబు ఫీజు రీఎంబ‌ర్స్‌మెంట్ విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం ఆల‌స్యం చేస్తుంద‌ని, బ‌కాయిల‌ని వెంటనే విడుద‌ల చేయాల‌ని వేలాది మంది విద్యార్ధుల‌తో ర్యాలీ చేప‌ట్టారు. ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉన్నందున ర్యాలీకి అనుమ‌తి లేద‌ని పోలీసులు చెప్ప‌డంతో రోడ్డుపై బైఠాయించి నిర‌స‌న తెలుపుతున్నారు. ఎన్నిక‌ల ముందు చంద్ర‌బాబు అనేక వాగ్ధానాలు చేశారు. కాని వాటిని నెర‌వేర్చ‌లేదు. 2017-18 విద్యాసంవత్సరంలో రూ. 2 కోట్ల బకాయిలను ప్ర‌భుత్వం చెల్లించాల్సి ఉంది. ఆ బ‌కాయిల‌ని వెంట‌నే చెల్లించాలని మోహ‌న్ బాబు కోరారు.

ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘చంద్రబాబంటే నాకు చాలా ఇష్టం. ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు నా విద్యార్థులతో కలిసి పోరాడాను. కానీ ఓటు వేసి గెలిపించిన ప్రజలను నాలుగున్నరేళ్లుగా ఏడిపిస్తున్నాడు. ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారు. పసుపు కుంకుమ కింద డ్వాక్రా మహిళలకు డబ్బులు ఇస్తున్నాడు. ఆవు-దూడ పథకం కింద గోవులను ఇస్తున్నాడు. కానీ విద్యార్థులకు మాత్రం ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయలేకపోతున్నాడు. అదేంటని అడిగితే అమరావతి కడుతున్నా అంటున్నాడు. ఆవు-దూడ పథకం యాడ్‌లో ఎద్దును చూపించి ఆవుగా నమ్మించే ప్రయత్నం చేశాడు. ఎవడి డబ్బుతో ఆవులు ఇస్తున్నాడు. అది ప్రజల సొమ్ము.

ప్రజల దగ్గర దోచుకున్న డబ్బును వాళ్లకే ఇస్తున్న చంద్రబాబు మా విద్యార్థులకు మాత్రం ఎందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించడం లేదు. దీనిపై ఎన్నిసార్లు ఉత్తరాలు రాసినా స్పందించడం లేదు. చంద్రబాబు అహంకారం పరాకాష్ఠకు చేరిపోయింది. అహంకారం ఉన్న వ్యక్తుల జీవితం ఎలా ముగుస్తుందో చూస్తూనే ఉన్నాం. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తుల జీవితం సువర్ణాక్షరాలతో రాసేలా ఉండాలి. అలా రాయడానికి నువ్వేమీ సత్య హరిశ్చంద్రుడివి, ధర్మరాజువి కాదు. అవన్నీ నాకు అనవసరం. నా విద్యార్థులకు రావాల్సిన డబ్బులు ఇస్తే చాలు’ అంటూ ముగించారు మోహన్‌బాబు.

మామాట: అనవలసినవన్నీ అనేశారు గా డైలాగ్ కింగ్

Leave a Reply