తిరుమల శ్రీవారి భక్తులకు 14 రకాల వంటకాలతో భోజనం!

cm-jagan-increase the ttd board members and finalise-the-list-of-ttd-board-members-board-members
Share Icons:
  • ఏపీ, తమిళనాడు, కర్ణాటక కూరగాయల దాతలతో అదనపు ఈవో ధర్మారెడ్డి సమావేశం
  • ఒక్కో యూనిట్‌కు 48 కిలోల చొప్పున కూరగాయలు అవసరం
  • దాతలను సన్మానించిన ధర్మారెడ్డి

     

తిరుమలలో శ్రీవారి భక్తులకు ఇకనుంచి 14 రకాల వంటకాలతో భోజనం పెట్టేందుకు దేవస్థానం నిర్ణయించటం పట్ల హర్షాతిరేకo  వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటి అన్నప్రసాదం కొనసాగింపుగానే ఇది ఉంటుంది. వచ్చిన ప్రతి భక్తుడు ఇక్కడ భోజనం చేయడం  స్వామి ప్రసాదం తీసుకున్న విధంగా ఫీలౌతుంటున్నారు. అందువల్ల ఆ ప్రసాదమును మరింత మెరుగు పరిచి అందరు మెచ్చే విధంగా తీర్చి దిద్దాలని  చైర్మన్ వై వి సుబ్బారెడ్డి నిర్ణయించారు .  ఉదయం, సాయంత్రం వేళల్లో వేర్వేరు మెనూతో భోజనం అందించాలని టీటీడీ  అన్నమయ్య భవనంలో, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల కూరగాయల దాతలతో సమావేశమై ఈ విషయాన్ని వెల్లడించారు. సమావేశం అనంతరం ధర్మారెడ్డి వారిని సన్మానించారు. గో ఆధారిత సేంద్రియ వ్యవసాయం ద్వారా కూరగాయలు పండించాలని దాతలను కోరారు.

కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

 

Leave a Reply