రేపటి నుంచే శ్రీవారి మహా సంప్రోక్షణ

రేపటి నుంచే శ్రీవారి మహా సంప్రోక్షణ
Views:
9

తిరుపతి, ఆగష్టు 10,

శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ క్రతువుకు శనివారం వైభవంగా అంకురార్పణ జరగనుంది. రాత్రి 7నుంచి 9గంటల వరకు విష్వక్సేనుల ఊరేగింపు ఉంటుంది. ఆదివారం ఉదయం 6గంటల నుంచి వైదిక క్రతువు ఆగమోక్తంగా ప్రారంభమవుతుంది. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక నుంచి 45మంది వేద పండితులు శుక్రవారం తిరుమల చేరుకున్నారు. ఈ నెల 16 వ తేదీ గురువారం పూర్ణాహుతితో క్రతువు ముగుస్తుంది. అదేరోజు సాయంత్రం గరుడ, పెద్దశేష వాహనాల్లో ఉత్సవర్లు తిరువీధుల్లో ఊరేగుతారు. ఇక యాగశాలలో ఇటుకలు, ఎర్రమట్టితో నిర్మించి గోమయంతో అలికిన 28 హోమగుండాలు, 21హోమ వేదికలను ఏర్పాటు చేశారు. వెలుతురు కోసం నెయ్యి దీపాలు వెలిగించడానికి ఏర్పాట్లు చేశారు. అలాగే చివరిరోజున ఆనందనిలయంపై ప్రధాన కలశానికి సంప్రోక్షణ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ ఏడాది సంప్రోక్షణకు పుష్పాలంకరణల కోసం దాదాపు 8టన్నుల పూలు, 30వేల కట్‌ ఫ్లవర్స్‌ విరాళంగా అందించేందుకు దాతలు ముందుకొచ్చారు. ఆలయం ముందు ఫాబ్రిక్‌ క్లాత్‌తో నిలువెత్తు శ్రీవారి భారీ ప్రతిమను ఏర్పాటు చేస్తున్నారు. మహాసంప్రోక్షణ సందర్భంగా భక్తుల దర్శన విషయంలో టీటీడీ ఆంక్షలను ఆరంభించింది. గురువారం అర్ధరాత్రి నుంచే దివ్య, సర్వదర్శనం టైంస్లాట్‌ టోకెన్ల మంజూరును రద్దు చేశారు. కేవలం సర్వదర్శనం భక్తులకు మాత్రమే పరిమిత సంఖ్యలో దర్శనం ఉంటుంది.

 

మాామాట: శ్రీనివాసా, నిన్ను దర్శించుకోవడానికి ఆంక్షలా స్వామీ

(Visited 9 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: