అల్సర్ నుండి విముక్తి పొందండిలా…

tips to overcome ulcer problems
Share Icons:

హైదరాబాద్:

నిత్యం పెరుగుతున్న కాలుష్యం, ఒత్తిళ్లతో పాటు మనిషి జీవన విధానం, ఆహార శైలిపూర్తిగా మారిపోయాయి. ఏ చిన్న సమస్య వచ్చినా మందులు వాడేస్తూ ఇస్తాం వచ్చినట్టు పైన్ కిల్లర్లు, యాంటీ బయోటిక్లు, ధూమ పానం, మద్య పానం, కిళ్ళీలు, గుట్కాలు నమలడం, రోడ్లపై ఏ చెత్త ఫుడ్ కనపడినా లాగించేయ్యడం వంటివి చేస్తూ ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారు. వాటిల్లో ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకి సంబంధించిన అల్సర్ వంటి వ్యాధులతో బాధపడుతూ తమ జీవితాలను స్వయంగా నాశనం చేసుకుంటున్నారు.

దిగే వరకు లోతు ఎంతుందో తెలియదన్న చందాన ఒక్కసారి జబ్బు వచ్చే వరకూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోరు. ఒకవేళ అజీర్ణ సమస్య ఎక్కువగా ఉంటే మెడికల్ షాపులో దొరికే మందులు వేసుకుని సరిపెట్టుకుంటున్నారు. అలా చెయ్యడం వల్ల సమస్య మరింత ఎక్కువవుతుందని గుర్తించట్లేదు. ఇకపై ఎవరికైనా జీర్ణ సమబంధిత వ్యాధులు వస్తే ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి. వైద్యుడు చెప్పిన మందులు వాడుతూ ఇంట్లో కొన్ని నియమాలు పాటిస్తే అల్సర్ నుండి త్వరగా విముక్తి పొందవచ్చు.

అల్సర్‌ను తగ్గించే చిట్కాలు… 

 1. వేళా పాళా లేకుండా తినకుండా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఒకే సమయంలో ప్రతిరోజూ ఆహారం తినాలి.
 2. కొందరికి పుల్లటి పదార్ధాలు తింటే నొప్పి వస్తుంది. మరికొందరికి కారం, మసాలాలు, ఇలా వేటి వల్ల ఇబ్బందిగా ఉంటుందో గుర్తించి వాటిని దూరం పెట్టాలి.
 3. ధూమ పానాలు, మద్య పానాలు, గుట్కాలు, కిళ్ళీలు వంటి దుర్వ్యసనాలను మానుకోవాలి.
 4. ఆందోళన కలిగించే విషయాల గురించి ఆలోచించకూడదు. ఒత్తిడిని తగ్గించే మార్గాలు వెతుక్కుని వీలైనంత వరకూ ప్రశాంతంగా ఉండాలి.
 5. కలుషితం లేని పరిశుభ్రమైన నీటిని మాత్రమే తాగాలి.
 6. డాక్టర్ చెబితే తప్ప పైన్ కిల్లర్లు వాడరాదు.
 7. రోజూ ఉదయం ఒక చెంచాడు తేనె తాగాలి. ఇలా చెయ్యడం వల్ల అల్సర్ త్వరగా తగ్గుముఖం పడుతుంది.
 8. అరటి పండ్లు అల్సర్‌కు దివ్య ఔషదంగా పని చేస్తుంది. వీటితో పాటు బాదం పప్పులు, చేపలు కూడా అల్సర్‌ని తగ్గిస్తాయి.
 9. మెంతి ఆకులని నీటిలో ఉడకబెట్టి, ఆ నీటిలో కొంచెం ఉప్పు వేసి ప్రతి రోజూ రెండు సార్ల చొప్పున గోరు వెచ్చగా చేసుకుని తాగితే అల్సర్ త్వరగా తగ్గిపోతుంది.

 10. రాత్రి పూట పడుకోబోయే ముందు క్యాబేజీ రసం తాగడం వల్ల అల్సర్ త్వరగా తగ్గుముఖం పడుతుంది.
 1. వెల్లుల్లి కూడా అల్సర్‌కు మంచి ఔషదంగా పనిచేస్తుంది. కడుపు మంటగా ఉన్నప్పుడు వెల్లుల్లి తినడం వల్ల మంట తగ్గుతుంది. రోజూ రెండు మూడు వెల్లుల్లి రెబ్బాలను తింటే అల్సర్ రాదు.
 2. నిమ్మ రసం, ద్రాక్ష రసం తాగినా అల్సర్ల వల్ల కలిగే నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.
 3. వంటల్లో కొబ్బరి నూనె వాడటం వలన కూడా అల్సర్ వల్ల వచ్చే పుండ్లు తాగిపోతాయి. కారణం కొబ్బరినూనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి.

మామాట: అందరికీ తెలిసేలా షేర్ చేయండి…

Leave a Reply