పక్కదారి పట్టిన ఇంటర్ నెట్: టిమ్ బర్నర్స్-లీ పెదవి విరుపు

Share Icons:

 లిస్బన్‌,  నవంబర్ 7,

ఇంటర్ నెట్ ప్రస్తుత స్థితిగతులపై డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ద్వారా సమాచార మార్పిడిని కనిపెట్టిన టిమ్ బర్నర్స్-లీ పెదవి విరిచారు. నెట్‌లో అంతా పక్కదారి పట్టింది. ఫేక్‌న్యూస్ కుప్పతెప్పలుగా వస్తున్నది. వ్యక్తి ఏకాంతం సమస్యగా మారింది. మనుషుల మెదళ్లను మార్చేస ప్రయత్నాలు జరుగుతున్నాయి.. అని టిమ్ పేర్కొన్నారు. 1989లో మొట్టమొదటిసారిగా వరల్డ్ వైడ్ వెబ్ అంటే సింపుల్‌గా మహానుభావుడు ఆయనే. ఈరోజు నెట్ అనేది సర్వవ్యాప్తమైంది. ఇంటింటింకీ చేరింది. చేతిలో అద్దమైంది. కానీ ఏ లక్ష్యాలతో నెట్‌ను ఆవిష్కరించారో ఆ లక్ష్యాలు పక్కదారి పట్టాయని టిమ్ ఆవేదన వ్యక్తం చేసారు.అసత్యప్రచారాలకు, ఫేక్‌న్యూస్‌కు నెట్ వేదిక కావడంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పోర్చుగల్ రాజధాని లిస్బన్‌లో జరుగతున్న అతిపెద్ద టెక్ ఈవెంట్‌లో ఆయన ప్రసంగించారు. వ్యవస్థాపకులు నిర్దేశించుకున్న మూలలక్ష్యాలు మూలకు పడ్డాయని, నానారకాల చెత్త నెట్‌లో సరఫరా అవుతున్నదని టిమ్ అన్నారు.

టెక్ దిగ్గజాల ప్రతినిధులు, రాజకీయవేత్తలు, స్టార్టప్‌లు, ఇన్వెస్టర్లు పెద్దఎత్తున పాల్గొనే ఈ సమావేశాన్ని టెక్ ప్రపంచపు దావోస్ సభలు అంటారు. ఈ సభల్లో నెట్ మూలపురుషుడైన టిమ్ మాట్లాడుతూ నెట్‌తో మానవ సంబంధాన్ని సమూలంగా మార్చేందుకుకొత్తగా నిర్వచించేందుకు ప్రభుత్వాలు, కంపెనీలు, పౌరులు కృషిచేయాలని పిలుపునిచ్చారు. 2019 మే నాటికి ఇంటర్నెట్‌ను సురక్షితంగా మార్చి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ఆయన ఉద్బోధించారు. ఆ తేదీయే ఎందుకు అంటే అప్పటికి ప్రపంచంలోని 50శాతం జనాభాకు నెట్ అందుబాటులోకి వస్తుంది.

మామాట: విజ్ఞానం రెండువైపులా పదునైన కత్తి 

 

Leave a Reply