దద్దరిల్లిన ఢిల్లీ

Share Icons:

కొత్త ఢిల్లీ, ఫిబ్రవరి 11,

సోమవారం ఉదయం దేశరాజధాని ఢిల్లీ దద్దరిల్లింది.  చల్లని ఉదయం వేళ ఇంకా కళ్లు నులుముకుంటున్న రాజధానిలో   పోలీసులకు, ఆగంతకులకు మధ్య భీకర పోరు జరిగింది. ఈ పోరులో ముగ్గురు  గుర్తుతెలియని వ్యక్తులు హతమయ్యారు. పూర్తి వివరాలు…  ఢిల్లీలోని రోహిణి సెక్టార్ 10 లోని స్వర్ణ జయంతి పార్కు వద్ద నీరజ్ బవానియా గ్యాంగ్ కు చెందిన నేరగాళ్లు దాడి చేసేందుకు వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురికి బుల్లెట్ గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు.అయితే, వారు అప్పటికే మరణించారని వైద్యులు ధ్రువీకరించారు. 

ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు పోలీసులకు బుల్లెట్లు తగిలినా, వారు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించడంతో ముప్పు తప్పిందని డీసీపీ సంజీవ్ యాదవ్ చెప్పారు. ఈ ఎన్ కౌంటర్ అనంతరం ఇద్దరు నేరస్థులను అదుపులోకి తీసుకున్నామని డీసీపీ చెప్పారు. ఈ ఘటనలో దోపిడీ దొంగలైన అర్పిత్ ఛిత్లార్, సునీల్ భూరా, సుఖ్విందర్ లు గాయపడ్డారని డీసీపీ వివరించారు. సంఘటన స్థలంలో పోలీసులు పిస్టల్, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. సంచలనం కలిగించిన ఎదురుక్లుల సంఘటనపై విచారణ చేపట్టినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

మామాట:  పోలీసులు ప్రాణాలు ఫణంగా పెట్టి విధినిర్వహణచేస్తున్నారుగా.

Leave a Reply