తూర్పు గోదావరిలో ఘొరం…బాణాసంచా పేలి ముగ్గురు మృతి….

Share Icons:

రాజమహేంద్రవరం, 22 సెప్టెంబర్:

తూర్పు గోదావరి జిల్లా రాజామహేద్రవరంలో వినాయక నిమజ్జనం కోసం బాణసంచా తయారుచేస్తుండగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ పేలుడు ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన రాజామహేద్రవరంలోని లాలాచెరువు సుబ్బారావుపేటలో నిన్నఅర్థరాత్రి చోటుచేసుకుంది.

ఈ ఘటనకి సంబంధించిన వివరాల్లోకి వెళితే…వినాయక నిమజ్జనం కోసం ఆర్డర్ రావడంతో ఓ కుటుంబం ఓ పూరి గుడిసెలో అక్రమంగా బాణసంచా తయారీని మొదలుపెట్టింది. అయితే శుక్రవారం రాత్రి వర్షం పడటంతో విద్యుత్ ఫ్లగ్‌ను బోర్డులో పెట్టగానే షార్ట్ సర్క్యూట్ సంభవించింది.

దీంతో ఆ మంటలు కాస్తా టపాసులకి అంటుకోవడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ మంటల్లో బాణాసంచా తయారుచేస్తున్న దేవాడ సుబ్బలక్ష్మి, సూర్యకాంతం, వినయ్ రెడ్డిలు సజీవదహనం అయ్యారు. ఇంకా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను 108 అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు.

మామాట: ప్రాణాలు హరిస్తున్న అక్రమ బాణాసంచా తయారీ…                 

Leave a Reply