మహేశ్ నెక్స్ట్ సినిమాకి మూడు అక్షరాల టైటిల్‌

Share Icons:

హైదరాబాద్, 15 మే:

సూపర్ స్టార్ మహేశ్ బాబుకి మూడు అక్షరాల టైటిల్ సెంటిమెంట్ వుంది. ‘మురారి’ ..అతడు, అర్జున్, ‘పోకిరి’ .. ‘ఒక్కడు’ .. ‘దూకుడు’ .. ఇలా మూడు అక్షరాలతో వచ్చిన ఆయన సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. తాజాగా మూడు అక్షరాలతో వచ్చిన ‘మహర్షి’ హిట్ టాక్ తెచ్చుకుంది.

ఈ నేపథ్యంలో తన తదుపరి సినిమా టైటిల్ కూడా మూడు అక్షరాలతో ఉండేలా చూడమని మహేశ్ బాబు .. అనిల్ రావిపూడితో అన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం టైటిల్ విషయంలోనే ఆయన కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం.

ఈ సినిమా పూర్తి వినోదభరితమైన కథాకథనాలతో ఈ సినిమా నడుస్తుందని అంటున్నారు. ఈ సినిమాకి ‘సరిలేరు నీకెవ్వరూ’ అనే టైటిల్ పరిశిలీస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ టైటిల్ ఖరారు కాకపోవచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది.

మామాట: సెంటిమెంట్ కలిసొస్తే మంచిదే 

Leave a Reply