భారత్ నెట్: ఏపీలోని గ్రామాలకు బ్రాడ్ బ్యాండ్ సేవలు…

thousands-of-villages-in-the-ap-under-the-bharat-net
Share Icons:

ఢిల్లీ: ఇటీవల పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టే నేపథ్యంలో భారత్ నెట్ ద్వారా లక్ష గ్రామ పంచాయితీలను అనుసంధానిస్తున్నట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన విషయం తెలిసిందే. భారత్ నెట్‌ కోసం.. రూ.6000 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇక ఏపీలో ఎన్ని వేల గ్రామాల్లో భారత్ నెట్ ద్వారా ఉచిత బ్రాడ్ బ్యాడ్ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ భారత్ నెట్ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ ద్వారా 1.3 లక్షల గ్రామ పంచాయతీలను అనుసంధానించిన కేంద్ర సర్కార్ దీనిని 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తుంది.  గ్రామాల్లోనూ అందరికీ ఇంటర్ నెట్ వినియోగంలోకి తీసుకురాగలిగితే డిజిటల్ లావా దేవీలను కొనసాగిస్తారని భావిస్తున్న సర్కార్ ఆ దిశగా అడుగులు వేస్తుంది.

ఆంధ్రప్రదేశ్ లో భారత్ నెట్ ప్రాజెక్ట్ కింద 2758 గ్రామాలకు బ్రాడ్ బ్యాండ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చినట్లు కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే రాజ్యసభలో తెలిపారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ధోత్రే రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం పేర్కొన్నారు. దేశంలోని రెండున్నర లక్షల గ్రామ పంచాయతీలను కలుపుతూ దశలవారీగా బ్రాడ్ బ్యాండ్ సదుపాయం కల్పించాలన్నది భారత్ నెట్ ప్రాజెక్ట్ ఉద్దేశ్యమని ధోత్రే చెప్పారు.

భారత్ నెట్ మొదటి దశ కింద ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో 1722 గ్రామ పంచాయతీలలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పనులు చేపట్టినట్లు మంత్రి ధోత్రే చెప్పారు. ఇందులో 1601 గ్రామ పంచాయతీలలో బ్రాడ్ బ్యాండ్ సేవలు సిద్ధమయ్యాయని మిగిలిన గ్రామాలలో పనులు కొనసాగుతున్నాయని చెప్పారు సంజయ్ ధోత్రే . మొత్తం ఏపీలో 2758 గ్రామాలకు బ్రాడ్ బ్యాండ్ సర్వీసులు అందుబాటులోకి వస్తున్నట్టు పేర్కొన్నారు.

 

Leave a Reply