అండర్‌వేర్‌ ఉద్యమంతో అట్టడుకుతున్న ఐర్లాండ్..

Share Icons:

ఐర్లాండ్, 17 నవంబర్:

అండర్‌వేర్ ఉద్యమంతో ఐర్లాండ్ అట్టడుకుతోంది. ఓ 17 ఏళ్ల అమ్మాయిపై జరిగిన అఘాయిత్యాన్ని నిలదీస్తూ.. ఆ దేశ మహిళలు అండర్‌వేర్‌ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉద్యమిస్తున్నారు.

ఇటీవల ఐర్లాండ్లోని కార్క్ పట్టణంలో 17 ఏళ్ల బాలికపై 27 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసిన కోర్టులో హాజరుపర్చారు. అయితే ఈ కేసు విచార‌ణ జ‌రుగుతున్న స‌మ‌యంలో మహిళలు వేసుకునే అండర్‌వేర్‌ను చూపిస్తూ….ఈ అమ్మాయి ఇలాంటి దుస్తులు వేసుకుని అతన్ని ఆకర్షించే ప్రయత్నం చేసిందని ఢిఫెన్స్‌ లాయ‌ర్ వాదించాడు.

ఇక ఈ విచారణ అనంతరం కోర్టు, నిందితుడిని నిర్ధోషిగా ప్రకటించింది. ఈ తీర్పుపై భగ్గుమన్న మహిళలు ‘ఎలాంటి అండర్ వేర్ వేసుకుంటే ఏంటీ..? అలాంటి లోదుస్తులు వేసుకున్నంత మాత్రానా శృంగారానికి సమ్మతి తెలిపినట్టు కాదు కదా?’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అలాగే ఆ దేశ మహిళా ఎంపీ రూత్ కాపింజర్ పార్లమెంట్‌లో అండర్‌వేర్ ప్రదర్శిస్తూ నిరసన తెలిపింది. ఆమె స్ఫూర్తితో ఇప్పుడు అండర్‌వేర్ ఉద్యమం ఊపందుకుంది.

మామాట: మరి ఈ ఉద్యమం ఎంత దూరం వెళుతుందో…

Leave a Reply