ఇంతకన్నా సిగ్గుమాలిన ప్రభుత్వం మరొకటుందా?: విజయశాంతి

Share Icons:

హైదరాబాద్, జనవరి 11 ,

రైతులను బంధువులా ఆదుకుంటామని చెప్పే కేసీఆర్ పాలనలో రోజుకు 40 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అధికారుల నివేదికలో స్పష్టమయిందని కాంగ్రెస్ నేత విజయశాంతి పేర్కొన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాన్ని గుర్తించి రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. కానీ వేలమంది ప్రాణాలు పోయేవరకు విభజన విషయంలో నిర్ణయాన్ని జాప్యం చేసినట్లుగా చూపిస్తూ కాంగ్రెస్ ను కేసీఆర్ దోషిగా చిత్రీకరించారు.

మరి వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే వరకు రైతుబంధు, రైతుభీమా పథకాలను ప్రవేశపెట్టకుండా చోద్యం చూసిన టీఆరెస్ అధిష్టానాన్ని దోషి అనాలా? క్రిమినల్ అనాలా? ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా? అని ఆమె ప్రిస్నించారు.ఒకేసారి రుణమాఫీ, నిజమైన శ్రామిక కౌలుదారులకు రైతుబంధు, గిట్టుబాటు ధర చెయ్యని టీ ఆరెస్ ఇందుకు కారణం, నెల రోజులకు  పైగా గడచినా జవాబు చెప్పడానికి ఇక్కడ ఇంకా సర్కార్ లేదు. ఇంకా ఎన్ని రోజులు ఏర్పాటు కాదో తెలీదు.ఛస్తే వచ్చే రైతుభీమా మాత్రమే సరిగ్గా వస్తుందనే నమ్మకం మాత్రమే ఈ ప్రభుత్వం కలిగించగలిగింది.

మామాట: మరి ప్రజలెలా ఎన్నుకున్నారమ్మా… 

Leave a Reply