న్యూఢిల్లీ, సెప్టెంబర్ 06:
లోక్సభకు ముందస్తు ఎన్నికలు జరిపితే తమ అసెంబ్లీకి కూడా వాటితో పాటు ముందస్తు ఎన్నికలు జరపాలని ఒడిస్సా అధికార పార్టీ బీజేడీ చేసిన అభ్యర్థనపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. 2019 జనవరి 31లోపు లోక్సభ ఎన్నికలు నిర్వహించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.
లోక్సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఆ తర్వాతే ప్రకటిస్తామని తేల్చి చెప్పింది. ఎన్నికలకు అవసరమైన ఈవీఎంలు, వీవీప్యాట్లు నవంబర్ 30, 2018కి తమకు అందుబాటులోకి వస్తాయని ఈసీ పేర్కొంది. అనంతరం మరో రెండు మూడు నెలలు ఓటర్ల జాబితాకు సంబంధించిన మార్పులుచేర్పులు ఉంటాయని తెలిపింది.
అందువల్ల జనవరి 2019లోపు లోక్సభ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని బీజేడీకి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఒకవేళ ముందస్తుగా లోక్సభ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటే, తమ అసెంబ్లీకి అప్పుడే ఎన్నికలు నిర్వహించాలని.. అలా చేస్తే తమకు వెయ్యి కోట్లు ఆదా అవుతాయని బీజేడీ నేత పినాకి మిశ్రా చేసిన అభ్యర్థనపై కేంద్ర ఎన్నికల సంఘం ఈ వివరణ ఇచ్చింది.
మామాట: ఎవరి బాధలు వారివి….