ఆర్టీఐ చట్టాన్ని సవరించనున్న కేంద్రం

Share Icons:

కొత్త డిల్లీ, జూన్16 , సమాచార హక్కు చట్టానికి (ఆర్ టి ఐ) సవరణలు తేనున్నట్టు కేంద్రం ఇప్పటికే ప్రకటించినా, ఆ వివరాలు బహిర్గతం చేయడానికి  డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్  అండ్ ట్రైనింగ్ (డిపిటి) సుముఖంగా లేదు.

అంజలి భరద్వాజ్ అనే సామాజిక కార్యకర్త ఇటీవల దాఖలు చేసిన పిటిషన్ కు బదులిచ్చిన డిపిటి,  సహ చట్టాని(2005)కి సవరణలు జరుగుతున్నాయని అంగీకరించింది, అయితే ఆ సవరణలు ఇంకా తుది రూపానికి చేరుకోనందున చట్టంలోని సెక్షన్ 8(1) (ఐ) ప్రకారం పూర్తి వివరాలు తెలియజేయలేమని అధికారులు తెలిపారు.  సహ చట్టం సవరణలు ఏమిటి, ఎప్పుటి నుంచి సవరణలు చేపట్టారు వంటి ఏవివరాలు  బహిర్గతం చేయలేమన్నారు. కాగా, సమాజంలో అవినీతి నేతలను, అధికారులను ప్రశ్నించే విజిల్ బ్లోయర్స్ రక్షణ చట్టానికి కేంద్రం తూట్లు పొడవనుందని, అందుకే సహ చట్టం 2005 సవరణలపై పెదవి విప్పడంలేదని కేంద్ర సంస్థలపై  సామాజిక కార్యకర్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అన్యాయాలను ప్రశ్నించేవారికి రక్షణలేకుండా పోతోందని,  ఈ విషయంలో కేంద్రం వపలవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోందని పరశీలకులు అనుమానిస్తున్నారు. అయితే సహచట్టం సవరణలను అడ్డుకుంటామని అంజలి భరద్వాజ్ ప్రకటించారు.

Leave a Reply