కొత్తగా నమోదైన149 రాజకీయ పార్టీలు

Share Icons:

కొత్త ఢిల్లీ,  మార్చి 19,

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొత్త కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి.  అనేక మంది కొత్తగా రాజకీయ పార్టీలను ప్రారంభిస్తున్నారు. ఈ నెల 9వ తేదీ వరకు ఎన్నికల సంఘం వద్ద నమోదైన రాజకీయ పార్టీల వివరాల ప్రకారం .. ఇప్పటివరకు దేశంలో మొత్తం 2293 రాజకీయ పార్టీలు ఉన్నాయి.  గుర్తింపు పొందిన ఏడు జాతీయ పార్టీలు, 59 ప్రాంతీయ పార్టీలను కలుపుకుని ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 2143 పార్టీలున్నాయి. ఫిబ్రవరి, మార్చి మధ్య కాలంలో మరో 149 రాజకీయ పార్టీలు రిజిస్టర్‌ అయ్యాయి.

ఇటీవల మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌, రాజస్థాన్‌, మిజోరాం, తెలంగాణలలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 58 పార్టీలు పుట్టుకొచ్చాయి. ఈ మధ్య రిజిస్టర్‌ ఐన 149 పార్టీల్లో యూపిలో సమ్మోహిక్‌ ఏక్తా పార్టీ, బీహార్‌లో బహుజన్‌ ఆజాద్‌ పార్టీ, రాజస్థాన్‌లో రాష్ట్రీయ సాఫ్‌ నితి పార్టీ, ఢిల్లీలో సబ్సీ బడీ పార్టీ, తెలంగాణలో భరోసా పార్టీ అవతరించాయి. ఐతే ఎన్నికల గుర్తు లభించని పార్టీలకు సొంతంగా పోటీ చేసే అర్హత లేదు. రాజకీయ పార్టీలు సాధారణంగా ఎన్నికల సంఘం వద్ద లభించే 84 గుర్తుల్లో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి ఉంటుంది.

మామాట: పార్టీ పెడితే పోయేదేముంది. . కనీసం పార్ట్ టీ అయినా వస్తుంది కదా…

Leave a Reply