భారీగా పెరిగిన బంగారం ధర

Share Icons:

హైదరాబాద్, మే15,

బంగారం ధరలు పెరిగాయి. ఒక్కరోజులోనే గ్రాముకి రూ.43 పెరిగి అమాంతం పైకి ఎగిసింది పసిడి. మరోవైపు వెండి కూడా బంగారం దిశలోనే పయనించింది. ఈ నేపథ్యంలో కిలో వెండి రూ.50 పెరిగింది.

నిన్నటితో పోలిస్తే బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం రూ..43 పెరిగి రూ.3,366 వద్ద స్థిరపడగా.. 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం రూ.43 పెరిగి రూ.3,091 వద్ద కొనసాగుతోంది.

అయితే, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి…

అంతర్జాతీయ మార్కెట్లో కిలో వెండి రూ.40,400 కి లభిస్తోంది.

వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు..

చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.33,660, 22 క్యారెట్ల బంగారం రూ.30,910,

కిలో వెండి రూ.40,400గా ఉంది.

ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.32,750, 22 క్యారెట్ల బంగారం రూ.31,550, కిలో వెండి రూ.40,400 గా ఉంది.

ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.32,300, 22 క్యారెట్ల బంగారం రూ.31,300, కిలో వెండి రూ.40,400 గా ఉంది.

హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.33,660, 22 క్యారెట్ల బంగారం రూ.30,910, కిలో వెండి రూ.40,400గా ఉంది. (గమనిక: నిమిషాల వ్యవధిలో బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులుంటాయి)

Leave a Reply