ఫెడరల్‌ ఫ్రంట్‌కు రంగు, రుచి, వాసన లేదు- తులసి రెడ్డి

Share Icons:

కడప, మే 15,

ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి ఈరోజు కపడ జిల్లా వేంపల్లెలో మీడియాతో మాట్లాడుతు తెలంగాణ సిఎం కెసిఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ అనేది పగటి కలే అని ఆయన అన్నారు. ఆ ఫ్రంట్‌కు రంగు, రుచి, వాసన లేదని ఆయన విమర్శించారు. ఏపి సిఎం చంద్రబాబు ప్రధాని రేసులో లేనంటూముందు నుంచే స్పష్టం చేస్తున్నారని తెలిపారు.

యూపీఏ కూటమిలో చంద్రబాబు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఈ నెల 16న కడప జిల్లాలో పర్యటిస్తారని, ఆ రోజు కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్‌ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నారని తులసిరెడ్డి వెల్లడించారు.

మామాట-  మీరు  భలే.. ముందే చెప్పేస్తారే సార్

Leave a Reply