పవన్ మిత్రుడు… ఉద్యమకారులు శత్రువులా?

Share Icons:

హైదరాబాద్, 23 జనవరి:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులని శత్రువులుగా భావిస్తుందని మండిపడ్డారు సీపీఐ రాష్ట్ర  కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అనేక రాజకీయ సమీకరణాలు మారాయని ఆయన అన్నారు.

ఉద్యమంలో పాల్గొనని వారికి ఇప్పుడు గుర్తింపు లభిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

పవన్ కళ్యాణ్ కరీంనగర్ జిల్లా నుండి మొదలుపెట్టిన రాజకీయ యాత్రకు టిఆర్ఎస్ నేతలు వంత పడుతున్నారని అన్నారు.

ఇంతకముందు ప్రత్యేక రాష్ట్రం వచ్చినప్పుడు 12 రోజులు ఉపవాసం ఉన్న పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రికి ఆత్మీయుడు ఎలా అయ్యాడని ప్రశ్నించారు.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న రాజకీయ, ప్రజా సంఘాల నాయకులను కేసీఆర్ శత్రువులుగా భావిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అలాగే తెలంగాణ వచ్చినందుకు ఉపవాసాలు చేసిన పవన్ కల్యాణ్ లాంటి వారు మిత్రులు ఎలా అవుతారని విమర్శించారు. ఆనాడు ఉద్యమానికి ఊపిరి పోసిన  వామపక్ష పార్టీలు, జేఏసి, ఇతర పార్టీలను విస్మరించరాని తెలిపారు.

అలాగే ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఇప్పుడే కార్మికుల సమస్యలు ఎక్కువయ్యాని, ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కరానికి ట్రేడ్ యూనియన్స్ మరింత ముందుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో జరిగిన  సంఘటనల ఆధారంగా ఒక పుస్తకం విడుదల చేస్తామని చాడ తెలిపారు.

మామాట: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే విషయం తెలిసిందేగా…

English summary: The CPI state secretary Chada Venkat Reddy said the Telangana state government thinks the activists are hostile. And TRS leaders are supported to pawan kalyan.

Leave a Reply