దేశం చాలా క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉంది – కే.ఏ.పాల్!

Share Icons:

అమరావతి,ఏప్రిల్ 19,

భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌రోసారి అధికారంలోకి వ‌స్తే భారత్ మ‌రింత అంధ‌కారంలోకి వెళ్తుందని ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కే.ఏ.పాల్ అన్నారు. తాను ముఖ్య‌మంత్రిని కాలేక‌పోయినా ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్య‌త అంద‌రిపై ఉంద‌న్నారు. బీజేపీ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే దేశంలో ప్ర‌జాస్వామ్యానికి, కోర్టు ఆదేశాల‌కు విలువ‌లేకుండా పోతుంద‌ని కే.ఏ.పాల్ అన్నారు.

దేశం చాలా ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితిలో ఉంద‌ని,   తాను ఈ విష‌యాన్ని ప్ర‌పంచానికి చెప్ప‌కుంటే ఆ పాపం త‌న‌ను వెంటాడుతుంద‌ని, అంద‌కే తాను ఈ విష‌యాన్ని మీడియాకు చెప్పిన‌ట్టు కే.ఏ.పాల్ తెలిపారు. 13 కోట్ల మంది క్రైస్త‌వులు డేంజ‌ర్‌లో ఉన్నార‌ని, దాదాపు ఏడు వంద‌ల పాస్ట‌ర్లు ఉత్త‌ర ప్ర‌దేశ్ నుంచి నార్త్, ఈస్ట్ ఎనిమిది రాష్ట్రాల‌కు వెళ్లి 25 పార్ల‌మెంట్ అభ్య‌ర్ధుల‌కు ఓట్లేయ‌మ‌ని ప్ర‌చారం చేస్తున్న‌ట్టు కే.ఏ.పాల్ చెప్పారు. అందుకు ప్ర‌ధాన కార‌ణం నార్త్‌, ఈస్ట్‌లో 60 శాతానికిపైగా క్రిస్టియ‌న్ ఓట‌ర్లు ఉన్నార‌ని, అలాగే 25 ఎంపీ స్థానాలు ఉన్న‌ట్టు కే.ఏ.పాల్ తెలిపారు.

మ‌ర‌లా ఆర్‌.ఎస్‌.ఎస్‌, భ‌జ‌రంగ్‌ద‌ళ్‌, విశ్వ హిందూ ప‌రిష‌త్ మ‌ద్దతుతో బీజేపీ గ‌వ‌ర్న‌మెంట్ వ‌స్తే క్రైస్త‌వుల ప‌రిస్థితి దారుణ‌మ‌వుతుంద‌న్నారు. గ‌త ఐదేళ్ల‌లో 30 వేల‌మందిని బీజేపీ బ‌ల‌వంతంగా హిందువులు మార్చింద‌ని కే.ఏ.పాల్ తెలిపారు.

మామాట: రాజకీయాలు – మతం కలిసిపోయాయిగా!

Leave a Reply