10వ తేదీ భారత్ బంద్

Share Icons:

హైదరాబాద్, సెప్టెంబర్ 07 ,

పెట్రో ధరల పెంపు పై ఏఐసీసీ  ఇచ్చిన పిలుపు మేరకు ఈనెల 10న భారత్ బంద్ లో తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలంతా  పాల్గొనాలి. ఈ నిరసనలో డిసీసీ లు, నియోజకవర్గం, డివిజన్ వాళ్ళు పాల్గొనాలని టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈనెల 12న గులాంనబీ ఆజాద్ వస్తున్నారు.  రాఫెల్ కుంభకోణం పై గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ లో పాల్గొంటారని అన్నారు. ప్రతి కాంగ్రెస్ వాళ్ళ ఇల్లు, వాహనాలపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి.  11 నుంచి 12 వరకు ఇలా చేయాలి. జెండా పండగ లో పాల్గొనాలి.  వార్ రూమ్ తెరవబోతున్నాం. ఇందులో 24 గంటలు ఎవరో ఒకరు అందుబాటులో ఉంటారు. జరగబోయే ఎన్నికలు..కెసిఆర్ కుటుంబం వర్సెస్ తెలంగాణ ప్రజలకు గా భావించాలని అయన అన్నారు.

ఈ పవిత్ర కార్యక్రమంలో టీడీపీ తో సహా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాల ప్రజలను, ఎన్.జి.ఓ లను ఆహ్వానిస్తున్నాం. ఈ ఎన్నికల ధర్మయుద్ధంలో అవినీతిపరులను మట్టి కరిపించాలి.  పొత్తుల పై పీసీసీ చీఫ్ ఉత్తమ్, బట్టి విక్రమార్క,  జానారెడ్డి, షబ్బీర్ అలీ పరిశీలిస్తారు. టిడిపి ని కూడా పొత్తు కు ఆహ్వానిస్తున్నామని అన్నారు. బీ ఫామ్ ఇంటికే పంపిస్తాం.  దుర్మార్గం పరిపాలన అంతం చేయడానికి ఎవరైనా నిశ్శబ్దంగా ఉంటే ఆ పాపంలో పాలు పంచుకున్నట్లే నని అయన అన్నారు.  కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ ఛార్జ్ కుంతియా మాట్లాడుతూ కాంగ్రెస్ లీడర్లను తయారు చేస్తుంది. ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించలేదు. సోషల్ మీడియాలో వచ్చే పేర్లు ఫేక్ అని స్పష్టతనిచ్చారు.

డిఎంకే మద్దతు..

పెట్రో ధరలపై సెప్టెంబరు 10 వ తేదీన దేశవ్యాప్త బంద్ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునకు మద్దతు లభిస్తోంది. తమిళనాడులో బంద్ విజయవంతం కావడానికి సహకరిస్తామని డిఎంకే సారథి ఎంకే. స్టాలిన్ శుక్రవారం ప్రకటించారు.  ఇంకా రాష్ట్రానికి చెందిన వామపక్ష పార్టీలు కూడా మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.

 

మామాట: బంద్ తో ధరలు దిగివచ్చాయా సారూ

Leave a Reply