TRENDING NOW

వైసీపీలో చేరిన కాంగ్రెస్ నేత

వైసీపీలో చేరిన కాంగ్రెస్ నేత
views:
31

గుంటూరు, 13 మార్చి:

గుంటూరు జిల్లాకి చెందిన కాంగ్రెస్ పార్టీ నేత చేజర్ల నారాయణరెడ్డి వైఎస్సార్ సీపీలో చేరారు.

జగన్ ప్రజాసంకల్పయాత్ర 111వ రోజు గుంటూరు జిల్లాలోని బాపట్ల శివారు నుంచి  ఆరంభించారు.

ఈ సందర్భంగా పాదయాత్రలో ఉన్న జగన్‌ని కలిసి తన అనుచరులతో సహా వైసీపీలో చేరుతున్నట్టు కాంగ్రెస్ నాయకుడు చేజర్ల ప్రకటించారు.

అనంతరం జగన్, చేజర్లను పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండువాను కప్పారు. చేజర్లతో పాటు కళ్లం హరినాథరెడ్డి తదితరులు వైసీపీలో చేరారు. చేజెర్ల 2014 ఎన్నికల్లో బాపట్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు.

కాగా, బాపట్ల నియోజకవర్గంలో ప్రవేశించిన జగన్ కు ప్రజల నుంచి ఘనస్వాగతం లభించింది. ఈ రోజు జగన్ పాదయాత్ర బాపట్ల మూర్తి రక్షణ నగరం, కొండుబొట్లవారి పాలెం క్రాస్‌, అప్పికట్ల, పూండ్లక్రాస్‌ మీదగా ఈతేరు వరకూ కొనసాగనుంది. సాయంత్రం ఈతేరులో జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. ఇప్పటివరకూ జగన్‌ 1,484.2 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.

మామాట: రాజకీయ సమీకరణలు మారుతున్నట్లున్నాయి….

English summary:

The Congress leader Chejerla  Narayana Reddy was joined to  YSRCP. Jagan started a padayatra from the Bapatla suburb of Guntur district on the 111th day.

(Visited 16 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: