ప్రపంచకప్: ఆసీస్ మళ్ళీ ట్యాంపరింగ్ చేసిందా….

Share Icons:

లండన్, 10 జూన్:

ప్రపంచకప్‌లో భాగంగా నిన్న భారత్-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. భారత్ 352 పరుగులు చేయగా…ఆసీస్ 316 పరుగులకి ఆలౌట్ అవ్వడంతో..ఇండియా 36 పరుగుల తేడాతో విజయం సాధించింది.

అయితే ఈ మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్ జరిగిందా? అనే అనుమానాలు వస్తున్నాయి. ఆసీస్ బౌలర్ ఆడం జంపా బౌలింగ్ చేస్తున్న సమయంలో పదేపదే జేబులో చేతులు పెట్టుకుని తడమడం, ఆపై బంతిని రుద్దుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

జంపా కచ్చితంగా బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి ఉంటాడని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. అతడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని, ప్రతిసారి జేబులో చేతులు పెట్టుకుని ఆపై బయటకు తీసి బంతిని రుద్దాడని, ఈ వీడియోపై ఐసీసీ దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు.

కాగా, గతేడాది కూడా ఆసీస్ బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు ఎదుర్కొని క్రికెట్ ప్రపంచం ముందు అభాసుపాలైంది. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో బంతిని ట్యాంపరింగ్ చేసిన ఆసీస్ ఆటగాళ్లు బెన్‌క్రాఫ్ట్, డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్‌పై ఐసీసీ నిషేధం కూడా విధించిన విషయం తెలిసిందే

Leave a Reply