ఆసక్తి రేపుతోన్న ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ ట్రైలర్…

Share Icons:

ముంబై, 27 డిసెంబర్:

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో మన్మోహన్ సింగ్ పాత్ర పోషిస్తున్నారు. ఇక విజయ్ రత్నాకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ట్రైలర్‌ని చిత్రబృందం తాజాగా విడుదల చేసింది.

‘మహాభారతంలో రెండు కుటుంబాలు ఉండేవి. కానీ భారత్ లో ఒకటే ఉంది’ అంటూ కాంగ్రెస్ పార్టీ జెండా కనిపించడంతో సినిమా ట్రైలర్ మొదలైంది. అలాగే ట్రైలర్‌లో మన్మోహన్ పాత్రను హైలైట్ చేస్తూ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల పాత్రలను టచ్ చేశారు. సునీల్‌ బోహ్రా, జయంతిలాల్‌ గదా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 11న సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. 

మామాట: మరి ఈ బయోపిక్ ఎలా ఉండబోతుందో

Leave a Reply