గెలిచేది ఆ పార్టీనే ..!

Share Icons:

అమరావతి, ఏప్రిల్ 12,

ఏపీలో పోలింగ్ ముగిసింది. రాష్ట్రంలో మొత్తం 75 నుండి 80శాతం పోలింగ్ నమోదు అయ్యిందని తెలుస్తోంది. ప్రశాంతంగా మొదలైన పోలింగ్ హింసాత్మకంగా ముగిసింది. దీంతో పోలింగ్ శాతం ఎక్కువగా జరిగితే ఎవరికి అడ్వాంటేజ్ ఉంటుందని సర్వత్రా చర్చలు మొదలయ్యాయి.   నిజానికి, పెరిగిన పోలింగ్ శాతం  వలన అవకాశం ఎక్కువగా వైసీపీకి అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అధికార పార్టీ పై ఉండే అసంతృప్తి నేపధ్యంలో ఓటర్లు ఎక్కువగా పోలింగ్ కేంద్రాల వద్ద కసి కొద్ది వెయిట్ చేశారనేది గతంలో వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు ఆంద్రప్రదేశ్ విషయానికి వస్తే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల ఫలితాలు అనుకూలంగా ఉండే సంకేతాలు కన్పిస్తున్నాయి. ఏపీలో మొత్తం 175 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్య పెద్ద ఎత్తున పోరుసాగింది.

జగన్ పాదయత్ర వేడి చల్లారక ముందే ఎన్నికలు జరగడం వైసీపీకి లాభిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో ఎన్నిడూ లేని విధంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారంటే టీడీపీ పై ఉన్న వ్యతిరేకతే కారణమని సర్వత్రా అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలకు రెండు నెలల ముందు చంద్రబాబు అనేక హామీలు ఇచ్చినా ప్రజలు వాటిని నమ్మలేదని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు.

దీంతో ఈ ఎన్నికల్లో పోలింగ్ సరళిని బట్టి చూస్తే అధికార తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఫలితాలు రాబోతున్నాయిని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మామాట: అంతేగా, అంతేగా..

Leave a Reply