తారక్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మరో సినిమా?

Share Icons:

హైదరాబాద్, 21 మే:

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా చేస్తున్నాడు. రామ్ చరణ్ మరో కథానాయకుడుగా నటిస్తున్న ఈ భారీ మల్టీ స్టారర్ చకచకా షూటింగు జరుపుకుంటోంది.

ఈ సినిమా షూటింగు పూర్తి చేసుకుని, విడుదల అయ్యేది 2020లో అప్పటి వరకు తారక్ ఇంకో సినిమాలో నటించే అవకాశం లేదు. అయితే ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ తదుపరి సినిమా వుండనుందనేది తాజా సమాచారం.

సోమవారం ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనని కొంతమంది అభిమానులు కలుసుకున్నారు. ఇక కొందరు అభిమానులు రాజమౌళితో చేస్తోన్న సినిమా తరువాత ఏ దర్శకుడితో తదుపరి సినిమా ఉంటుంది? అని ఎన్టీఆర్‌ని అడిగారని తెలుస్తోంది.

ఇక అభిమానులు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఎన్టీఆర్… తన తదుపరి చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఉంటుందని చెప్పినట్లు సమాచారం. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెల్సిందే. గతేడాది దసరా సందర్భంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద 95 కోట్ల షేర్‌ని కలెక్ట్ చేసి సూపర్ హిట్‌గా నిలిచింది.

మామాట: మళ్ళీ హిట్ కాంబినేషన్ హిట్ కొడుతుందా

Leave a Reply