తేజ్ యాప్ పేరు మార్పు

Share Icons:

 అమెరికా, ఆగస్టు 28,

గతంలో గూగుల్ సంస్థ రూపొందించిన ‘తేజ్’ యాప్ పేరు మారింది. గతేడాది సెప్టెంబర్ లో ప్రారంభమైన తేజ్ యాప్ ఏడాది గడిచిపోవడంతో సరికొత్త లుక్ తో ‘గూగుల్ పే’ గా మార్చినట్లు ఆ సంస్థ ట్విట్టర్ లో పేర్కొంది. పేమెంట్ మోడ్ తో మొట్టమొదటిసారి ఇండియాలో గూగుల్ తేజ్  యాప్  ప్రవేశపెట్టగా, ఈ ఏడాది కాలంలో రూ.2 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయని కంపెనీ తెలిపింది. కొత్త గూగుల్ పే యాప్ తో సులువుగా ఆన్‌లైన్ ట్రాన్సక్షన్స్ చేసుకోవడంతో పాటు బుక్ మై షో, గోఐబిబో, రెడ్‌బస్‌ లాంటి వాటిలో టికెట్ లు సులువుగా బుక్ చేసుకునే వీలు ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఫెడరల్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌ లతో గూగుల్ పే అనుసంధానం కావడంతో వినియోగాదారులు రుణాలు కూడా పొందే అవకాశం ఉందని గూగుల్ పే అధికారి సేన్‌గుప్తా తెలిపారు.

మామాట: ఏ రాయి అయితేనేమి.. పళ్లు రాలేదానికి

Leave a Reply