TRENDING NOW

ఆర్మీలో ఉద్యోగాలు

ఆర్మీలో ఉద్యోగాలు
Views:
24

కొత్త ఢిల్లీ, నవంబర్ 08,

ఇండియ‌న్ ఆర్మీ 2019 జులైలో ప్రారంభం కానున్న‌ 10+2 టెక్నిక‌ల్ ఎంట్రీ స్కీమ్ (టీఈఎస్-41) కోర్సు కోసం అవివాహితులైన పురుష అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఇంటర్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే ఈ పరీక్షకు అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్ మార్కులు, ఇంటర్వ్యూ లో ప్రదర్శన  ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ.. నవంబరు 27.  10+2 టెక్నిక‌ల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు (టీఈఎస్‌-41)

మొత్తం ఖాళీల సంఖ్య‌: 90.

అర్హ‌త‌: 70 శాతం మార్కులతో ఇంటర్ (ఎంపీసీ) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. అభ్యర్థులు నిర్దిష్ట శారీర‌క‌, వైద్య ప్ర‌మాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి: 16.5 – 19.5 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్య‌ర్థులు 01.01.2000 నుంచి 01.01.2003 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక‌ విధానం: విద్యార్హ‌త‌లో ప్ర‌తిభ‌, ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ ఆధారంగా. ఎంపికైనవారికి 5 సంవ‌త్స‌రాల శిక్ష‌ణ కాలం ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 27.11.2018.
ఇంటర్వ్యూలు: 2019 జనవరిలో.

మామాట:  ఇంటర్ చదివినా మంచి ఉద్యోగాలున్నాయన్నా

 

 

(Visited 26 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: