అదిరిపోయే అందాల టెన్నిస్ క్వీన్స్ క్యాట్ వాక్

Share Icons:

సింగపూర్, అక్టోబర్ 22,

వారు పేరుపొందిన క్రీడానిపుణులే కాదు, అంతకంటే అందంస్వంతం చేసుకున్న జవ్వనులు. వారే మేటి టెన్నీస్ తారలు… 2018 మహిళల టెన్నిస్ అసోయేషన్ ( డబ్ల్యూటీఎ ) తుదిపోటీలలో ఎనిమిది మంది టెన్నిస్ క్రీడా రాణులు పోటీలో ఉన్నారు. ఈ సందర్భంగా సింగపూర్ వేదికగా జరుగుతోన్న డబ్ల్యూటీఎ ఫైనల్స్‌ పార్టీలో  ఈ సుందరీమణులు సందడి చేశారు.

జర్మన్ వండర్.. ఏంజెలిక్ కెర్బర్ , డెన్మార్క్ స్టార్.. కరోలిన్ ఓజ్నియాకీ, జపనీస్ సెన్సేషన్..  నవోమి ఒసాకా, చెక్ రిపబ్లిక్ టెన్నిస్ క్వీన్స్… పెట్రా క్విటోవా,  కరోలినా ప్లిస్కోవా,  అమెరికన్ స్టార్.. స్లోయాన్ స్టీఫెన్స్, ఉక్రెయిన్ టెన్నిస్ క్వీన్.. ఎ లీనా స్విటోలినా, నెదర్లాండ్స్ రైజింగ్ స్టార్ కీకీ బెర్టెన్స్….. డిజైనర్ దుస్తుల్లో పార్టీ మొత్తానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆహూతులను అందచందాలతో అలరించారు . మైదానంలో కాదు వేదిక మీదా తమకు తిరుగులేదని టెన్నీస్ స్టార్స్ ఎలీనా స్విటోలీనా, కికి బెర్టెన్స్ కరోలినా ప్లిస్కోవా, స్లొయాన్ స్టీఫెన్స్ ఏంజెలిక్ కెర్బర్, కరోలిన్ ఓజ్నియాకీ తదితరులు అందాలతో మెరిసిపోయారు. ఆహ్లాదంగా సెల్ఫీలు దిగారు, విజేతలకు అందించే ట్రోఫీతో ఫోజులిచ్చారు.

 

మామాట:  టెన్నీస్ కోర్టులో ఆట కంటే ఆటా పాటా ఉంటే మెరుగ్గా ఉన్నారే.

Leave a Reply