‘తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్’ పోస్టర్…

Share Icons:

హైదరాబాద్, 7 మే:

యువకథానాయకుడు సందీప్ కిషన్ హీరోగా, కామెడీ సినిమాల డైరెక్టర్ జి. నాగేశ్వర రెడ్డి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్’. ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుంది.

ఇక ఈ సినిమాలో సందీప్ కిషన్ కేసులు లేని లాయర్ గా నటిస్తున్నాడు. ఆయన సరసన నాయికగా హన్సిక నటిస్తుండగా, మరో కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించనున్నారు.

అయితే ఈ రోజున సందీప్ కిషన్ పుట్టినరోజు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు. ఈ పోస్టర్ పై సందీప్ కిషన్ మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.

మామాట: మరి సందీప్ ఈ సినిమాతో అయినా హిట్ కొడతాడా

Leave a Reply