ఆలయాలు-ఆడువారు

Share Icons:

మతం, భక్తి, దేవుడు, గుడి, ఆచారం, సంప్రదాయం, నియమాలు, నమ్మకాలు వ్యక్తిగతమైనవి.. ఆధునిక చట్టాలకు, హేతువాదుల వాదనలకు అవి అంతుచిక్కనివి. న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేనివి. గతంలో బ్రిటీష్ పాలకులు కూడా మత సంస్థలు, సంస్కృతి, భక్తికి సంబంధించిన విషయాలను చట్టపరిధిలో కాక స్థానిక సంప్రదాయాల మేరకు పరిష్కరించుకునే వెసులుబాటు యిచ్చి వున్నారు.

 

[pinpoll id=”63742″]

అయితే, తాజాగా భారత సర్వోన్నత న్యాయస్థానం అయ్యప్ప దేవాలయంలోకి మహిళల ప్రవేశంపై ఇచ్చిన తీర్పు వివాదాస్పదమైన విషయం తెలిసిందే.  ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో వాతావరణం తీవ్రంగా వేడెక్కింది. మహిళలు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి వస్తున్నారు. ఆలయం ధర్మకర్తలు, బోర్డు, ప్రభుత్వం  నాలుగుస్థంబాల ఆట ఆడుతున్నాయి. ఇక్కడ నిశితంగా గమనించ వలసింది ఏమిటంటే.. శబరి మల  ఆలయంలోకి పూర్తిగా మహిళల నిషేదం లేదు.  రసజ్వల కాని బాలికలు, ఋతుక్రమం ఆగిపోయిన (అంటే 60 ఏళ్లు వయసు నిండిన వారు) మహిళలు స్వామివారిని నిరభ్యంతరంగా దర్శించుకోవచ్చు. ఆలయంలోకి వెళ్ల వచ్చు, ఇరుముడి కట్టి పవిత్రంగా భావించే 18 మెట్లు ఎక్కవచ్చు. గతాచారంగా వస్తున్నదేమంటే అయ్యప్ప బ్రహ్మచర్య దీక్షలో ఉన్న వాడు కనుక ఋతుక్రమం మొదలైన మహిళలు శబరి మలకు వెళ్లకూడదనేది ఆచారం. ఇతర ఆలయాలలో ఇటువంటి నిబంధన లేదు. నిజానికి దీనిని విశాలహృదయంతో ఆచరించ వచ్చు.  పెద్ద నష్టం ఏమీ లేదు. అయినా దీనిపై కోర్టులు, కేసులు, వాదనలు, తీర్పులు, ధర్నాలు, నిరసనల సవాళ్లు ఎందుకో అర్థం కాదు. వివిధ మతాచారాలు కలిగిన ప్రజలున్న ఈ దేశంలో ఇటువంటివి సున్నితమైనవి. ఇపుడు దీనిని సాకుగా చూపి ముస్లీం మహిళల మసీదు ప్రవేశానికి వివాదం రాజు కుంది.. రేపు మరొకటి.. తరువాత ఇంకొకటి వస్తాయి… దీనివెనుక పాలకులో, ప్రతిపక్షాలదో పెద్ద రాజకీయ వ్యూహం కూడా ఉండి ఉండవచ్చుకదా… ఏమో.. ఎవరికి తెలుసు.

మామాట: ఇంతకీ దేహమే దేవాలయం అన్నది ఉత్తదేనా?

Leave a Reply