ఇక ఆ జిల్లాలో టీడీపీ కోలుకోవడం కష్టమే…..

main leaders ready to leave tdp
Share Icons:

అమరావతి: రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న ఆ జిల్లాలో మాత్రం అధికారం ఆ పార్టీదే అన్నట్లుగా ఉంటుంది. గెలిచినా…ఓడినా ఆ పార్టీకి తిరుగులేదు. ఇంతలా ఆధిపత్యం ప్రదర్శించే పార్టీ ఏదో కాదు. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీనే. ఆ జిల్లా వచ్చి కర్నూలు జిల్లా. ఇక్కడ 2014 ఎన్నికలు కావొచ్చు…మొన్న వచ్చిన 2019 ఎన్నికలు కావొచ్చు. ఇక్కడ వైసీపీదే ఆధిక్యం. 2014 ఎన్నికల్లో ఈ జిల్లాలో 14 అసెంబ్లీ, 2 పార్లమెంట్ సీట్లు ఉంటే అందులో 11 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలు వైసీపీనే గెలిచింది. కాకపోతే అధికారం టీడీపీ దక్కించుకుంది. దీంతో కొందరు ఆ పార్టీలోకి జంప్ అయ్యారు.

అయితే మొన్న ఎన్నికల్లో మాత్రం వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. ఇలాంటి చోట టీడీపీ పరిస్తితి మరి ఘోరంగా ఉంది. మొన్న ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ నేతలు అడ్రెస్ లేకుండా వెళ్ళిపోయారు. ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడూ జిల్లాని శాసించిన కే‌ఈ కృష్ణమూర్తి ఫ్యామిలీ యాక్టివ్ గా లేదు. మొన్న ఎన్నికల్లో కే‌ఈ పోటీకి దిగకుండా ఆయన తనయుడు శ్యామ్ బాబుని పత్తికొండ నుంచి పోటీకి దింపితే….ఆయన తమ్ముడు ప్రభాకర్ ని డోన్ నుంచి బరిలో దింపారు. ఇద్దరు ఘోరంగా ఓడిపోయారు. ఓటమి తర్వాత వీరు సైలెంట్ అయిపోయారు.

ఇక తర్వాత ఎన్నికల ముందు టీడీపీ లో చేరిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఫ్యామిలీ కూడా అంత యాక్టివ్ గా కనిపించడం లేదు. కోట్ల కర్నూలు లోక్ సభ నుంచి పోటీ చేసి ఓడిపోతే, ఆయన భార్య సుజాతమ్మ ఆలూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అటు ఆళ్ళగడ్డలో ఓడిపోయిన భూమా అఖిలప్రియ, నంద్యాల ఓడిపోయిన భూమా బ్రహ్మానందరెడ్డిలు పూర్తి సైలెంట్ అయిపోయారు. కాకపోతే అఖిలప్రియ కాస్తా యాక్టివ్ గా కనిపిస్తోంది. అలాగే ఆమె భర్త పలు కేసుల్లో చిక్కుకుని ఉన్నారు. ఇక బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి, యెమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి, పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డిలు సైలెంట్ అయిపోయారు.

అలాగే నందికొట్కూరు బండి జయరాజు, శ్రీశైలం బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఎరాసు ప్రతాప్ రెడ్డి, కర్నూలులో టీజీ వెంకటేష్ బీజేపీ తీర్ధం పుచ్చుకుంటే ఆయన తనయుడు భరత్ టీడీపీలోనే కొనసాగుతున్నాడు. కానీ అంత యాక్టివ్ గా లేడు. మంత్రాలయంలో తిక్కారెడ్డి, కోడుమూరులో మదన్ దాస్, ఆదోనిలో మీనాక్షి నాయుడు, నంద్యాలలో ఎంపీగా ఓడిపోయిన మాండ్ర శివనాందరెడ్డిలు అడ్రెస్ లేరు. మొత్తానికి ఈ జిల్లాలో టీడీపీ ఇప్పటిలో కోలుకోవడం కష్టమే.

 

Leave a Reply