ఒకే ఫ్రేములో టాలీవుడ్ టాప్ డైరక్టర్స్…

Telugu top directors attend the dinner party at vamsi paidipalli home
Share Icons:

హైదరాబాద్, 5 జూన్:

మామూలుగా ఎవరైనా ఇద్దరు స్టార్ హీరోలు ఒకే వేదిక మీద కనిపిస్తే చాలు అభిమానులు పండుగ చేసుకుంటారు.

అయితే ప్రస్తుతం ఇలాంటి అరుదైన ఘటనలు టాలీవుడ్‌లో చాలానే చోటుచేసుకుంటున్నాయి.

ఒక హీరో ఆడియో ఫంక్షన్‌కి మరొక హీరో వెళ్ళడం. అలాగే విందు కార్యక్రమానికి ఒకరిని ఒకరు ఆహ్వానించుకోవడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి.

అయితే హీరోలే కాదు మేము కూడా అలా కలుస్తాము అంటూ టాలీవుడ్‌కి చెందిన టాప్ డైరక్టర్స్ అందరూ ఒకచోట కలిశారు.

జూన్ 4వ తేదీ సోమవారం రాత్రి డైరెక్టర్ వంశీ పైడిపల్లి విందు పార్టీ ఇచ్చారు. దీనికి ఆప్తులు అందర్నీ పిలిచారు.

అయితే దీనికి హీరోలు, హీరోయిన్స్, నిర్మాతలు ఎవరు వచ్చారో తెలియదు కానీ.. డైరెక్టర్స్ మాత్రం అందరూ అటెండ్ అయ్యారు.

అందరూ కలిసి ఫొటో దిగారు. అద్భుతమైన వ్యక్తులతో మరిచిపోలేని సాయంత్రం గడిపాను అంటూ వంశీ పైడిపల్లి ట్వీట్ కూడా చేశారు. ఇక దీన్ని తెలుగు సినిమా అభిమానులు విపరీతంగా షేర్ చేస్తూ లైకులు, కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఈ విందు పార్టీకి హాజరు అయిన దర్శకులు ఎవరంటే?  ‘బాహుబలి’ రాజమౌళి, ‘భరత్ అనే నేను’ కొరటాల శివ, ‘రంగస్థలం’ సుకుమార్, ‘శాతకర్ణి’ క్రిష్, ‘మహానటి’ నాగ్ అశ్విన్, ‘గబ్బర్ సింగ్’ హరీష్ శంకర్, ‘అర్జున్ రెడ్డి’ సందీప్ వంగ, ‘పటాస్’ అనిల్ రావిపూడి.

మామాట: స్నేహపూరిత వాతావరణంలో తెలుగు సినిమా పరిశ్రమ…

Leave a Reply