అమెరికాలో కాల్పులు…గుంటూరు వాసి మృతి

telugu man died in america
Share Icons:

గుంటూరు, సెప్టెంబర్ 7:

అమెరికాలో కాల్పులు మరోసారి కలకలం సృష్టించాయి. ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరణించిన వారిలో ఒకరు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పృథ్విరాజ్‌(25)గా గుర్తించారు. ఈ ఘటన సిన్సినాటిలోని వాల్‌నట్‌ స్ట్రీట్‌లోని బ్యాంక్‌లో చోటుచేసుకుంది. మృతి చెందిన పృథ్వీరాజ్‌ బ్యాంక్‌ ఉద్యోగిగా తెలిసింది.

ఈ కాల్పుల వివరాల్లోకి వెళితే… ఓహియో రాష్ట్రంలోని సిన్సినాటీ నగరంలో ఉన్న ఫిఫ్త్ థర్డ్ సెంటర్ లో ప్రవేశించిన ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ తెలుగు యువకుడు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇక పోలీస్ అధికారులు జరిపిన ఎదురుకాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు. స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం 9 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఫౌంటైన్ స్వ్కేర్ లోని ఫిఫ్త్ థర్డ్ సెంటర్ భవనం లాబీలో జరిగిన ఈ కాల్పులు జరిపిన వ్యక్తిని ఒమర్ ఎన్రిక్ శాంటా(29)గా అధికారులు గుర్తించారు.

పృథ్వీరాజ్ భౌతికకాయాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు అమెరికా అధికారులతో కుటుంబ సభ్యులు చర్చిస్తున్నారు. కాగా, ఒక్కగానొక్క కుమారుడు చనిపోవడంతో పృథ్వీరాజ్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

మామాట: ఈ కాల్పుల ఘటనలు ఆగేదెప్పుడో?

Leave a Reply