పచ్చని పంటపొలాల్లో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

Share Icons:

అమలాపురం, వికారాబాద్ జనవరి 27:

గణతంత్ర దినోత్సవం నాడు తమ కష్టంతో దేశాన్ని నడిపించే అన్నదాతలు జాతీయ భావాన్ని చాటుకున్నారు.

రైతన్నలు శుక్రవారం పచ్చని పంటపొలాల మధ్య త్రివర్ణ పతాకాన్ని  ఎగురవేసి సెల్యూట్ చేశారు  .

మూడు రంగుల జెండాలో ఒకటైన ఆకుపచ్చని రంగు పాడి పంటల గుర్తే కదా.. అదే రంగు పొలంలో ఆ త్రివర్ణ పతాకం రెపరెపలాడుతున్న దృశ్యం అందరికీ కన్నులపండువ చేసింది.

మరొక చోట మడిలో నారును భారతదేశ పటం ఆకృతిలో తీర్చిదిద్ది, జాతీయ జెండాలను చేతపట్టుకుని దేశంపై తమకున్న భక్తిని చాటుకున్నారు కొందరు అన్నదాతలు.

Andhra farmers flag hosting in crop field

ఈ అద్భుత దృశ్యాలు జరిగింది ఎక్కడో కాదు మన తెలుగు రాష్ట్రాల్లోనే..

శుక్రవారం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్‌ అన్నదాతలు అమలాపురం మండలం అప్పారివారిపాలెంలో త్రివర్ణ పతాకం ఎగురవేసి దేశభక్తిని చాటుకున్నారు.

తెలంగాణ రైతన్నలు వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మంబాపూర్‌లో ఇలా నారుతో భారదేశ చిత్రా పటాన్ని ఆవిష్కరించారు.

మామాట: రైతు రాజ్యం రాకపోతోందా…! వారి కల నిజం కాకపోతుందా..!  

English summary:

On the occasion of republic day farmers showed their Patriotism in two Telugu states. In Andhra Pradesh, amalapuram mandal appalavari palem village  some farmers showed his respect towards nation by hosting flag in crop field. In Telangana, Vikarabad district, peddemul mandal, manbapur village some farmers showed their Patriotism by designing India map in crop field with rice leaves.  

 

Leave a Reply