టీవీ అమ్మకాలకు కిక్ ఇస్తున్న ఫిఫా వరల్డ్ కప్…

Televisions sales increase in india because of fifa world cup
Share Icons:

ఢిల్లీ, 15 జూన్:

ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచ కప్ అభిమానులకే కాకుండా టెలివిజన్ అమ్మకదారులకు కూడా మంచి కిక్ ఇస్తోంది. సాకర్ ఫీవర్‌తో ఈసారి టీవీ అమ్మకాలు 10 నుంచి 15 శాతం పెరుగవచ్చని ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సామ్‌సంగ్ అంచనా వేసింది.

రష్యాలో నిన్నటి నుంచి ప్రారంభమైన ఈ మెగా టోర్నీని దృష్టిలో పెట్టుకొని సంస్థ ప్రీమియం టీవీలను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. మనదేశంలో అధిక సంఖ్యలో ఉన్న ఫుట్‌బాల్ అభిమానులని లక్ష్యంగా చేసుకుని మూడు రకాల టీవీలను విడుదల చేసినట్లు సామ్‌సంగ్ ఇండియా జనరల్ మేనేజర్ పీయూష్ కున్నాపల్లి చెప్పారు

వీటిలో క్యూలెడ్ ప్రీమియం కాగా, అల్ట్రా హై డెఫినేషన్ మధ్యస్థాయి, కాన్సెర్ట్ తక్కువ స్థాయిది. 55 నుంచి 77 అంగుళాలు కలిగిన క్యూలెడ్ టీవీల ధరలు రూ.2.45 లక్షల నుంచి రూ. 25 లక్షల మధ్యలోఉన్నాయి. అలాగే రూ.64,500 నుంచి రూ.4.20 లక్షల లోపు కలిగిన యూహెచ్‌డీ 16 మోడళ్లు కూడా ఉన్నాయి.

ఇక వీటితోపాటు నాలుగు స్పీకర్లు కలిగిన కాన్సెర్ట్ టీవీల ప్రారంభ ధరను రూ.27,500, గరిష్ఠంగా రూ.73,500గా నిర్ణయించింది. కాగా, ప్రస్తుతం భారత్‌లో టీవీల మార్కెట్ రూ.50,000 కోట్ల స్థాయిలో ఉన్నదని, ప్రతియేటా 7-8 శాతం మేర వృద్ధిని నమోదు చేసుకుంటున్నదన్నారు.

మామాట: ఫుట్‌బాల్ ప్రేమికులకి ఇలా గేలం వేశారనమాట…

Leave a Reply