టీటీడీపీ నుంచి బీజేపీలోకి భారీ వలసలు?

tdp mla's condemn the news to spread they are ready to join bjp
Share Icons:

హైదరాబాద్:

 

ఆపరేషన్ కమలం పేరిట రెండు తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న బీజేపీ మరింత దూకుడు పెంచింది. ఇప్పటికే అటు ఏపీలో ఇటు తెలంగాణ లో ఇతర పార్టీల నాయకులను చేర్చుకుంటున్న బీజేపీ మరింతగా వలసలని ప్రోత్సహించనుంది. నిన్న తెలంగాణ నుండి మాజీ ఎంపీ వివేక్ అమిత్ షా సారథ్యంలో బీజేపీలో చేరారు. ఇక త్వరలో ఆయన హైదరాబాద్ రానున్న నేపథ్యంలో టీడీపీ నుంచి మరిన్ని వలసలు జరగనున్నాయి.

టీడీపీ నుంచి ఎన్నికైనరాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు, ఆయన మద్దతుదారులు పెద్ద సంఖ్యలో చేరనున్న సందర్భంగా 18న నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్సులో భారీ సభ నిర్వహిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఏపీ ఎంపీలు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో బీజేపీలో చేరగా, తాను హైదరాబాదులో మద్దతుదారులతో కలిసి బహిరంగసభ ఏర్పాటు చేస్తానని, ఆ సందర్భంగా పార్టీలో చేరతానని గరికపాటి ప్రతిపాదించారు. 18న జరిగే బహిరంగ సభలో, ఉమ్మడి వరంగల్‌, నల్గొండ, మెదక్‌, రంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లా కార్యవర్గాలకు చెందిన పలువురు టీడీపీ ముఖ్య నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు బీజేపీలో చేరనున్నారు.

 

మరోపక్క టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ కూటమిని ఇరుకున పెట్టేందుకు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని (సెప్టెంబరు 17న) భారీ ఎత్తున నిర్వహించేందుకు సన్నద్ధమైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా.. సెప్టెంబరు 17న రాష్ట్రంలో జరిగే భారీ బహిరంగ సభకు వస్తున్నారు. అంతకన్నా ముందు ఈ నెల 18న కూడా ఆయన హైదరాబాద్‌ వస్తున్నారు.

Leave a Reply