తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీలకి మరో షాక్… పార్టీని వీడనున్న సీనియర్ నేతలు

Share Icons:

హైదరాబాద్:

తెలంగాణలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకి వరుస షాకులు తగులుతున్నాయి.  ఇప్పటికే పలువురు నేతలు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఇక మరికొందరు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీడీపీ సీనియర్ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కొండా సురేఖలు బీజేపీలోకి వెళ్లనున్నారు.

రేవూరి ఇటీవల హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంత్రి అమిత్ షాను కలిసేందుకు ప్రయత్నించారు. కానీ, అదే రోజు కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ హఠాన్మరణంతో, షా హుటాహుటిన ఢిల్లీకి పయనమై వెళ్లిపోయారు. దీంతో షా-రేవూరి భేటీకీ వీలుకాలేదు. అయితే త్వరలోనే ఢిల్లీ వెళ్లి మరి అమిత్‌షాను కలిసి బీజేపీలో చేరే అవకాశం ఉంది.

అయితే సోదరుడు మృతితో కొండా సురేఖ బీజేపీలో చేరికకు కొంత ఆలస్యమైంది. అయితే రేవూరి చేరిక త్వరలోనే ఉండొచ్చు. అన్నీ అనుకున్నట్లు జరిగితే కొండా సురేఖ, రేవూరి ఇద్దరూ ఒకేసారి కాషాయం కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.

 

Leave a Reply