పదో తరగతి అర్హతతో తెలంగాణ పోస్టల్ లో 1058 ఉద్యోగాలు…

పదో తరగతి అర్హతతో తెలంగాణ పోస్టల్ లో 1058 ఉద్యోగాలు…
Views:
89

హైదరాబాద్, 13 మార్చి:

తెలంగాణ రాష్ట్రంలోని పోస్టల్ సర్కిల్ లో ఖాళీలు ఉన్న 1058 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి అర్హతతో, 18ఏళ్ల నుంచి 40 ఏళ్ల లోపు వయసు ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఇక అదనపు విద్యార్హతలకు వెయిటేజీ ఉండదు. పదో తరగతిలో వచ్చిన మార్కులను బట్టి అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.

ఉద్యోగ వివరాలు…

మొత్తం ఖాళీలు: 1058

ఓ‌సి-559, ఓబీసీ-247, ఎస్సీ-133, ఎస్టీ-76, దివ్యాంగులు-43

పోస్టల్ డివిజన్లు: ఆదిలాబాద్‌, హన్మకొండ, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నల్గొండ, నిజామాబాద్‌, పెద్దపల్లి, సూర్యాపేట, వనపర్తి, వరంగల్‌, హైదరాబాద్‌ (సిటీ/ సౌత్‌ ఈస్ట్‌), మెదక్‌, సంగారెడ్డి, సికింద్రాబాద్‌.

అర్హత: పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి.

వయసు: 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా

దరఖాస్తు ఫీజు: రూ.100 (ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులు / మహిళలకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది)

దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఏప్రిల్‌ 9

రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్‌: http://117.239.178.144/gdsonline/fee.aspx

అప్లై చేసుకోవడం కోసం వెబ్‌సైట్: http://117.239.178.144/gdsonline/reference.aspx

అఫీషియల్ వెబ్‌సైట్: http://www.appost.in/gdsonline/

గమనిక: ఒకవేళ ఎవరైనా అభ్యర్థులకు ఒకే మార్కులు వచ్చినట్లయితే పుట్టిన తేదీ, రిజర్వేషన్ బట్టి అభ్యర్ధులని ఎంపిక చేస్తారు.

మామాట: తెలంగాణలోని నిరోద్యుగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు…..

English summary:

Telangana Postal Circle has announced a notification for the recruitment of Gramin Dak Sevak (GDS) 1058 vacancies in Telangana Circle.

(Visited 119 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: