మున్సిపల్ పోరు: అసంతృప్తులని బుజ్జగిస్తున్న కేటీఆర్…

ktr give strong counter to pakistan netizen
Share Icons:

హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాయి. అయితే అధికార టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తుల బెడద ఎక్కువైపోయింది. ఇక వారిని బుజ్జగించే పనిలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బిజీగా ఉన్నారు. ప్రగతి భవన్ లో పలువురు నేతలనీ ఆయన బుజ్జగిస్తున్నారు. ఇదిలా ఉంటే పోలింగ్‌కు ముందే అధికార టీఆర్ఎస్ పార్టీ బోణీ కొట్టింది. మంచిర్యాల జిల్లా లంపల్లి మున్సిపాలిటీ 17వ వార్డు(జనరల్)లో టీఆర్ఎస్ అభ్యర్థి సుదర్శన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అతనొక్కడే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవం అయినట్లు అధికారులు ప్రకటించారు. ఇలా ఏకగ్రీవం రూపంలో టీఆర్ఎస్ బోణీ కొట్టడంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

కరీంనగర్ మినహా రాష్ట్రవ్యాప్తంగా 9 కార్పొరేషన్లలోని 325 కార్పొరేటర్, 120 మున్సిపాలిటీల్లోని 2,727 కౌన్సిలర్ స్థానాలకు జనవరి 22న పోలింగ్ జరగనుంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. శనివారం ఎన్నికల అధికారులు నామినేషన్లను పరిశీలించి.. తిరస్కరరణకు గురైన వాటిని ప్రకటిస్తారు. జనవరి 12, 13 తేదీల్లో తిరస్కరణకు గురైన నామినేషనన్లపై అప్పీల్ చేసుకోవచ్చు. జనవరి 14 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుంది. జనవరి 22న పోలింగ్ జరగనుండగా.. జనవరి 25న ఫలితాలను ప్రకటిస్తారు. ఒక్క కరీంనగర్‌ కార్పొరేషన్ పరిధిలో మాత్రం 24న పోలింగ్ జరుగుతుంది. 27న ఫలితాలను వెల్లడిస్తారు.

అయితే మున్సిపల్ టికెట్ల విషయంలో ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ నేతలు కేటీఆర్‌కు రికమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ శివారులో కొత్తగా ఏడు మున్సిపల్ కార్పోరేషన్లతో పాటు 17 మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. ఇందులో నిజాంపేట,మణికొండ,బడంగ్‌పేట్,మీర్‌పేట్,తెల్లాపూర్ ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఏపీ నుంచి వచ్చి స్థిరపడ్డవాళ్లు ఎక్కువగా ఉన్నారు. వారిలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చినవాళ్లూ ఉన్నారు. వీరిలో కొందరు ఇప్పుడు మున్సిపల్ టికెట్ల ఆశావహుల జాబితాలో ఉన్నారు. స్థానిక నేతలు కావడంతో టికెట్ల కోసం టీఆర్ఎస్ పెద్ద తలకాయలను పట్టుకోవడం వారి వల్ల కావట్లేదట. దీంతో ఏపీ నుంచి రాయబారం మొదలుపెట్టిన కొంతమంది నేతలు.. అక్కడి అధికార పార్టీ ఎమ్మెల్యేలు,మంత్రులు ద్వారా తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ఫోన్లు చేయించినట్లు తెలిసింది. తమవాళ్లకు మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలంటూ ఏపీకి చెందిన సదరు నేతలు కేటీఆర్‌ను కోరినట్లు సమాచారం. మరి ఏపీ నేతలు ఎంతమంది వారికి టికెట్లు ఇప్పించారో తెలియాల్సి ఉంది.

 

Leave a Reply