ఉత్తమ్, రేవంత్‌లకు కారు బ్రేక్: హుజూర్ నగర్, కొండగల్‌లలో టీఆర్ఎస్ హవా

Share Icons:

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలకు కారు బ్రేకులు వేసింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ సొంత నియోజకవర్గం హుజూర్ నగర్ మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అటు రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌ని కూడా టీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. మొత్తం మీద మున్సిపాల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ జోరు కొనసాగుతుంది. ఆందోల్, బాన్సువాడ, ఆత్మకూర్, కల్వకుర్తి వర్ధనపేట, బొల్లారం, కొత్తుపల్లి మున్సిపాలిటీలు కారు ఖాతలోనే పడ్డాయి.

మరిపెడ మున్సిపాలిటిలో మొత్తం 15 వార్డుల్లోనూ టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. వార్డుల వారీగా విజయాలను అనౌన్స్ చేస్తున్నారు ఎన్నికల అధికారులు. అక్కడ 15 స్థానాలకు 15 టీఆర్ఎస్ గెలుచుకుంది. వర్థన్నపేట, మరిపెడ, దర్మపురి మున్సిపాలిటీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ధర్మపురిలో టీఆర్ఎస్ 8 స్థానాలను గెలుచుకోగా, కాంగ్రెస్ 7 స్థానాలను గెలుచుకుంది. ఇక్కడ బీజేపీ ఖాతా తెరవలేకపోవడం విశేషం.

అటు కామారెడ్డి మున్సిపాలిటీలో కూడా టీఆర్ఎస్‌కు అనుకున్న ఫలితం రాలేదు. ఇక్కడ కాంగ్రెస్-ఇండిపెండెంట్స్ కలిపి 8 వార్డుల్లో విజయం సాధిస్తే…టీఆర్ఎస్ 4 వార్డుల్లో గెలిచింది.

సత్తుపల్లి మునిసిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. సత్తుపల్లిలో మొత్తం 23 వార్డులు ఉండగా ఇప్పటికే చైర్మన్ పదవికి అవసరమైన స్థానాలను టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. నిజామాబాద్ జిల్లా భీంగల్‌లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసేసింది. మొత్తం 12 వార్డులకు గాను.. ఒకటి ఏకగ్రీవం కాగా.. మిగిలిన 11 వార్డులను టీఆర్ఎస్ దక్కించుకుంది. ఇప్పటికే చెన్నూరు, పరకాల మునిసిపాలిటీలను టీఆర్ఎస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

ఇక రాష్ట్రం మొత్తం మీద వస్తున్న ఫలితాలని ఒక్కసారి చెక్ చేసుకుంటే మొత్తం 120 మున్సిపాలిటీల్లో  టీఆర్ఎస్ 56, కాంగ్రెస్ 3, బీజేపీ 1 చోట సత్తా చాటగా,  9 కార్పొరేషన్‌ల్లో టీఆర్ఎస్ 2 చోట్ల గెలిచింది.

 

Leave a Reply