TRENDING NOW

ఎన్టీఆర్, ప్రభాస్‌, త్రివిక్రమ్‌లకి తలసాని గ్రీన్ ఛాలెంజ్‌..

ఎన్టీఆర్, ప్రభాస్‌, త్రివిక్రమ్‌లకి తలసాని గ్రీన్ ఛాలెంజ్‌..
views:
22

హైదరాబాద్, 10 ఆగష్టు:

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘హరితహారం’ కార్యక్రమంలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ పేరుతో రాజకీయ, సినీ ప్రముఖులు మొక్కలు నాటుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఛాలెంజ్‌లో భాగంగా చాలామంది ప్రముఖులు మొక్కలు నాటి హరిత హరానికి మద్ధతు తెలిపారు.

తాజాగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా మూడు మొక్క‌లు నాటి హ‌రిత స‌వాల్‌ని ఎన్టీఆర్‌, ప్ర‌భాస్‌, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌, నిర్మాత దిల్ రాజు, టీటీడి ఛైర్మ‌న్ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌ల‌కి స‌వాల్ విసిరారు.

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ విసిరిన హరిత ఛాలెంజ్‌లో భాగంగా తలసాని ఛాలెంజ్‌ని స్వీకరించి పూర్తిచేశారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ….మ‌నుషుల మ‌నుగ‌డ కోసం ప్ర‌తి ఒక్క‌రు చెట్లు నాటాలని, హరితహారం పేరుతో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మొక్కలు నాటామని తెలిపారు.

మామాట: మొక్కలు లేని చోట నాటితే బాగుంటుందేమో….

(Visited 22 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: