తనయుడితో జూ. ఎన్టీఆర్‌ను క‌లిసిన మంత్రి పువ్వాడ అజ‌య్!

Share Icons:
  • పువ్వాడ నయన్ పుట్టినరోజు సందర్భంగా
  • మర్యాదపూర్వకంగా కలిశాన‌న్న పువ్వాడ‌.
  • అనంత‌రం కేటీఆర్ వ‌ద్ద‌కు పువ్వాడ‌

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇటీవల కాలంలో ఏది చేసిన సంచలనంగా మారుతుంది. గతంలో  షూటింగ్ ఇల్లందు లో జరుగుతున్న సందర్భంగా ఖమ్మం వచ్చిన చిరంజీవికి, రాంచరణ్ కు తన నివాసంలో మంత్రి ఆతిధ్యం ఇచ్చారు. వారిని ఘనంగా సన్మానించారు. అజయ్ ఇటీవల సినీప్రముఖులు డైరక్టర్ కొరటాల శివతో సన్నిహితంగా ఉంటున్నారు . మంత్రి తనకుమారుని సినీ రంగంలోకి దించుతారా,  సినీ నిర్మాతగా మారనున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

నా తనయుడు డాక్ట‌ర్ పువ్వాడ నయన్ పుట్టినరోజు సందర్భంగా జూనియ‌ర్ ఎన్టీఆర్ని మర్యాదపూర్వకంగా కలిశానని మంత్రి పువ్వాడ అజ‌య్ అన్నారు. తార‌క్ తో తీసుకున్న ఫొటోల‌ను ఆయ‌న పోస్ట్ చేశారు. అక్క‌డ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ కూడా ఉన్నారు. అయితే, పువ్వాడ జూనియ‌ర్ ఎన్టీఆర్ ను క‌ల‌వ‌డం ప‌ట్ల ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రోవైపు, కేటీఆర్‌ను కూడా పువ్వాడ అజ‌య్ కుమార్, నయ‌న్ కలిశారు.

-కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.    

Leave a Reply