ఏపీ రాజధానిపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..పవన్‌పై సెటైర్లు…

ktr give strong counter to pakistan netizen
Share Icons:

అమరావతి: ఏపీ రాజధాని అంశంపై గత కొన్ని రోజులుగా తీవ్ర ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక దీనిపై తెలంగాణ నేతలు కూడా అప్పుడప్పుడు స్పందిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ దేనిపై స్పందించారు.  ఏపీలో రాజధాని మారుస్తామంటే ఆందోళనలు చేస్తున్నారని… తెలంగాణలో చిన్న ఆందోళన కూడా లేకుండా జిల్లాల విభజన చేశామని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీలో రాజధాని మార్పుపై ఇంత ఆందోళన, వ్యతిరేకత ఎందుకు వస్తోందో ఆలోచించాల్సి అవసరం ఉందని కేటీఆర్ అన్నారు.

అటు పవన్ కళ్యాణ్‌పై కేటీఆర్ తనదైన స్టయిల్లో సెటైర్లు వేశారు. జనసేన అంతర్జాతీయ పార్టీ కూడా కావొచ్చేమో అని కేటీఆర్ సెటైర్ వేశారు. పవన్ కళ్యాణ్ ఏం చేస్తే మాకేం సంబంధమన్న కేటీఆర్… ఆయన రాజకీయాలపై ఏపీ ప్రజలు చూసుకుంటారని అన్నారు. ఏపీ రాజధాని రగడపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అటు పవన్ పై వైసీపీ నేతలు కూడా విమర్శలు చేస్తున్నారు. పవన్ బీజేపీతో కలవడంపై వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పవన్ పార్టీకి సిద్ధాంతాలు లేవని… ఆయనో ఫ్రీలాన్స్ పొలిటీషియన్ అని వ్యాఖ్యానించారు. పవన్‌కు స్థిరత్వం, వ్యక్తిత్వం లేదని విమర్శించారు. బీజేపీ – జనసేన కూటమితో తమకు నష్టం లేదన్నారు. జగన్‌పై బీజేపీ-జనసేన నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. చంద్రబాబు కోసమే పవన్ జనసేనను స్థాపించారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పవన్‌ సర్పంచ్‌గా పోటీ చేసి గెలవాలని… ఆ తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వస్తామన్న మాటలు మాట్లాడాలని సవాల్ విసిరారు. అన్ని ప్రాంతాలకు మేలు చేసేందుకు జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రత్యేకహోదా కోసం పోరాడుతూనే ఉంటామని వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్‌ స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో శుక్రవారం హైపవర్‌ కమిటీ సమావేశమయ్యింది. హైప‌వ‌ర్ క‌మిటీలో చ‌ర్చించిన అంశాల‌ను కమిటీ జ‌గ‌న్‌కు వివ‌రించ‌నుంది. కాగా ఇవాళ హైపవర్ కమిటీ భేటీతో మూడు రాజధానులపై స్పష్టత వచ్చే అవకాశముంది.

 

Leave a Reply