ల్యాబ్ టెక్నీషియ‌న్-గ్రేడ్‌-2 పోస్టుల‌కు అద‌న‌పు అర్హ‌త‌ల‌కు అనుమ‌తి

Share Icons:

5వేల మంది నిరుద్యోగుల‌కి ద‌ర‌ఖాస్తు చేసుకునే అవ‌కాశం

ఆఖ‌రు తేదీ ఫిబ్ర‌వ‌రి 25కు పొడిగింపు

హైద‌రాబాద్ , 15 ఫిబ్రవరి:

ల్యాబ్ టెక్నీషియ‌న్ గ్రేడ్‌-2 పోస్టుల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల అభ్య‌ర్థుల‌కి శుభ‌వార్త‌! అనేక మంది నిరుద్యోగ ల్యాబ్ టెక్నీషియ‌న్స్ అభ్య‌ర్థ‌న మేర‌కు అద‌నంగా మ‌రో 12 అద‌న‌పు అర్హ‌త‌ల‌కు అనుమ‌తినిస్తూ తెలంగాణ వైద్య ఆరోగ్య‌శాఖ జీవోని జారీ చేసింది. దీంతో మ‌రో 5వేల మందికి ద‌ర‌ఖాస్తు చేసుకునే వీలు క‌లుగుతున్న‌ది. అలాగే జ‌న‌వ‌రి 24తోనే ముగిసిన ద‌ర‌ఖాస్తు గ‌డువును కూడా ఫిబ్ర‌వ‌రి 25వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

ఈ మ‌ధ్య తెలంగాణ వైద్య ఆరోగ్య‌శాఖ‌లో క‌ల్పిస్తున్న 10వేల ఉద్యోగాల కల్ప‌న‌లో భాగంగా ల్యాబ్ టెక్నీషియ‌న్స్‌కి తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ద్వారా 200 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ వేసింది. జీవో నెంబ‌ర్ 67 ద్వారా టీఎస్‌పీఎస్సీ నోటిఫికేష‌న్ జారీ చేసింది. గ‌త నెల 24వ తేదీని ద‌ర‌ఖాస్తుకు ఆఖ‌రు తేదీగా నిర్ణ‌యించింది.

ఇంట‌ర్‌, డిఎంఎల్‌టి లేదా బిఎస్సీ (గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుండి) త‌ప్ప‌నిస‌రిగా తెలంగాణ లేదా ఎపీ పారా మెడిక‌ల్ బోర్డులో రిజిస్ట‌ర్ చేయించుకున్న అభ్య‌ర్థుల అర్హ‌త‌ల‌ను ప్ర‌క‌టించింది. అయితే ఈ లోగా ఈ అర్హ‌త‌ల వ‌ల్ల కొంద‌రికే అవ‌కాశం ల‌భిస్తున్న‌ద‌ని, మ‌రిన్ని అర్హ‌త‌లున్న‌ వాళ్ళకు కూడా అవ‌కాశం కల్పించాల‌ని అనేక మంది అభ్య‌ర్థులు ప్ర‌భుత్వానికి విన్న‌వించుకున్నారు.

దీంతో వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి ల‌క్ష్మారెడ్డి చొర‌వ తీసుకుని, మ‌రిన్ని అర్హ‌త‌ల‌ను కూడా ఆ నోటిఫికేష‌న్‌లో చేర్పించేందుకు అధికారుల‌తో చ‌ర్చించారు. సీఎం కేసిఆర్ దృష్టికి కూడా ఈ విష‌యాన్ని తీసుకెళ్ళారు. సీఎం అనుమ‌తితో మ‌రో 12 అర్హ‌త‌ల‌ను కూడా చేర్చారు.

ఆ అర్హ‌త‌ల‌ వివరాలు…

 1. స‌ర్టిఫికేట్ ఇన్ ల్యాబ‌రేట‌రీ టెక్నీషియ‌న్ కోర్సు
 2. ఎంఎల్‌టి (విఓసి)/ ఇంట‌ర్మీడియ‌ట్ (ఎంఎల్‌టి-ఒకేష‌న‌ల్‌) క‌నీసం ఏడాదిపాటు క్లీనిక‌ల్ శిక్ష‌ణ లేదా అప్రెంటీస్‌షిప్
 3. డిప్లోమా ఇన్ మెడిక‌ల్ ల్యాబ్ టెక్నీషియ‌న్ కోర్సు (డిఎంఎల్‌టి)
 4. బిఎస్సీ (ఎంఎల్‌టి)/ఎంఎస్సీ (ఎంఎల్‌టి)
 5. డిప్లొమా ఇన్ మెడిక‌ల్ ల్యాబ్ (క్లీనిక‌ల్ పాథాల‌జీ) టెక్నిక‌ల్ కోర్సు
 6. బ్యాచిల‌ర్ ఇన్ మెడిక‌ల్ ట్యాబ‌రేట‌రీ టెక్నాల‌జీ (బిఎంఎల్‌టి)
 7. పీజీ డిప్లొమా ఇన్ క్లీనిక‌ల్ బ‌యో కెమిస్ట్రీ
 8. పీజీ డిప్లొమా ఇన్ మెడిక‌ల్ ల్యాబ‌రేట‌రీ టెక్నాల‌జీ
 9. బిఎస్సీ మైక్రోబ‌యాల‌జీ/ఎంఎస్‌సీ ఇన్ మైక్రో బ‌యాల‌జీ)
 10. ఎమ్మెస్సీ ఇన్ మెడిక‌ల్ బ‌యో కెమిస్ట్రీ
 11. ఎంఎస్సీ ఎన్ క్లీనిక‌ల్ బ‌యాల‌జీ
 12. ఎమ్మెస్సీ ఇన్ బ‌యో కెమిస్ట్రీ

ఇక డిపిహెచ్ ప‌రిధిలో 103, డిఎంఇ ప‌రిధిలో 88, తెలంగాణ వైద్య విధాన ప‌రిష‌త్ ప‌రిధిలో 09 పోస్టులు, మొత్తం 200 పోస్టుల‌కు టీఎస్సీ పీఎస్సీ ద్వారా అభ్య‌ర్థుల ఎంపిక జ‌ర‌గ‌నుంది. ఈ అవ‌కాశాన్ని నిరుద్యోగ ల్యాబ్ టెక్నీషియ‌న్ అభ్య‌ర్థులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.

మామాట: అర్హతలు కలిగిన నిరోద్యుగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి…

English summary:

Good news for unemployed candidates waiting for Lab Technician Grade-2 posts! The Telangana Medical Health Ministry has issued a G.O to request for the 12 additional benefits to the request of many unemployed Lab Technicians.

Leave a Reply