పోటీ చేస్తారా…కాంగ్రెస్ కోసం పని చేస్తారా…

Share Icons:

హైదరాబాద్, 21 మార్చి:

తెలంగాణలో టీడీపీ దాదాపుగా కనుమరుగయ్యే పరిస్థితుల్లో ఉన్న విషయం తెలిసిందే. ఎంత కనుమరుగవుతున్న ఇప్పటికీ ఆ పార్టీకి ఎంతో కొంత ఓటు బ్యాంకు ఉంది. దీంతో పార్టీకి బలం ఉన్న కొన్ని పార్లమెంట్ స్థానాల్లో అయినా పోటీ చేస్తే బాగుంటుందని టీ టీడీపీ నేతలు కొందరు భావిస్తున్నారు.

ఖమ్మం, మల్కాజ్ గిరి లోక్ సభ స్థానాల్లో పోటీ చేయాలని టీ టీడీపీ నేతలపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలోనే పార్టీ నేతలు ఈరోజు చంద్రబాబుని కలవనున్నారు. టీ టీడీపీ కీలక నేత నామా నాగేశ్వరరావు పార్టీని వీడటంతో పాటు పలు అంశాలపై చంద్రబాబుతో చర్చించనున్న తెలంగాణ నేతలు… మల్కాజ్ గిరి, ఖమ్మం లోక్ సభ స్థానాలకు పోటీ చేసే అంశంపై కూడా చర్చించనున్నారు.

పార్టీ అనుమతిస్తే ఖమ్మం ఎంపీగా పోటీ చేసేందుకు జిల్లా నేత కోనేరు చిన్ని సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు మల్కాజ్ గిరికి చెందిన పలువురు నేతలు సైతం ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా దెబ్బతిన్నందువల్ల, లోక్ సభ ఎన్నికల్లో టీ టీడీపీ పోటీకి చంద్రబాబు అనుమతి ఇస్తారా లేదా అన్నది సందేహంగా మారింది. జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇస్తున్న చంద్రబాబు… తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు కోసం పని చేయాలని టీ టీడీపీ నేతలకు సూచించే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. మరి చూడాలి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.

మామాట: పోటీ చేసే సత్తా ఇంకా ఉందంటారా…

Leave a Reply