తెలంగాణలో రేపటినుంచి 10 రోజుల లాక్ డౌన్

Share Icons:

హైదరాబాద్: లాక్‌డౌన్‌పై తెలంగాణ ప్రభుత్వం  ప్రకటన చేసింది. రేపటి నుంచి పది రోజుల పాటు రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించనున్నట్టు ప్రకటించింది. బుధవారం ఉదయం 10 గంటల నుంచి పదిరోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్నీ కార్యకలాపాలకు అవకాశం ఉంటుందని క్యాబినెట్‌లో నిర్ణయించారు. టీకా కొనుగోళ్ల కోసం గ్లోబల్ టెండర్లను పిలవాలని క్యాబినెట్ నిర్ణయించింది. లాక్ డౌన్ ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు .

 

-ఎన్నార్కె.

Leave a Reply