వైఎస్ జగన్‌ను కలిసిన తెలంగాణ నేతలు!

Share Icons:

శ్రీకాకుళం,జనవరి 2:

శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను కొందరు తెలంగాణ నేతలు కలుసుకున్నారు. భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు శాంతికుమార్ తదితరులు పాదయాత్రలో పాల్గొని, జగన్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

తరువాత వారు  మీడియాతో మాట్లాడుతూ, ఏపీ ప్రజలు రానున్న ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలన్న నిర్ణయంలో ఉన్నారని అన్నారు.  జగన్ ను సీఎంగా చూడాలనుకుంటున్నారని అన్నారు. మరో నాలుగు నెలల్లో జరిగే ఎన్నికల్లో వైకాపా విజయం ఖాయమన్నారు. జగన్‌ను కలుసుకున్న వారిలో వైసీపీ నేతలు రమేష్, మహేందర్, రాజు, కిరణ్ తదితరులు ఉన్నారు.

ఇదిలా ఉంటే వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర చివరి నియోజకవర్గమైన ఇచ్చాపురంలోకి ప్రవేశించింది.ఈ సందర్భంగా వైఎస్ జగన్ ను ఏడు గ్రామాలకు చెందిన కిడ్నీ వ్యాధిగ్రస్తులు కలిశారు. వారికి భరోసాను కల్పిస్తూ, అధికారంలోకి రాగానే, నెలకు రూ. 10 వేల పింఛన్ ను కిడ్నీ బాధితులకు ఇస్తానని కీలక హామీని ఇచ్చారు. 

మామాట: అయితే వైసీపీకి తెలంగాణలో నాయకులు ఉన్నారు

Leave a Reply