గెస్ట్ హౌస్ కేసు: ప్రభాస్ భూకబ్జాదారుడు….

Share Icons:

హైదరాబాద్, 3 జనవరి:

తెలంగాణ రాష్ట్రంలోని శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం వద్ద హీరో ప్రభాస్‌కి చెందిన ఓ గెస్ట్ హౌస్‌ని ఇటీవల అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ గెస్ట్ హౌస్ ప్రభుత్వ భూమిలో ఉందని అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇక దీనిపై స్పందించిన ప్రభాస్… హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పలు వాయిదాలు, విచారణల అనంతరం ఈరోజు మరోసారి ఈ భూవివాదం కేసుపై హైకోర్టులో వాదనలు జరిగాయి.

ఈ సందర్భంగా ప్రభాస్ భూకబ్జాదారుడని, ఆయనకి అనుకూలంగా తీర్పిస్తే ఆ భూమిని కబ్జా చేసిన వాళ్ళూ అర్హులవుతారని  ప్రభుత్వ లాయర్ వాదించారు. మరోపక్క కొనుగోలు చేసిన భూమిలోనే  గెస్ట్ హౌస్ కట్టుకున్నాడని  ప్రభాస్ తరఫు లాయర్ కోర్టుకి తెలిపారు.

ఇక ఇరు వాదనలు విన్న న్యాయస్థానం తీర్పుని రిజర్వ్ చేసింది. రీల్ లైఫ్ లో విలన్లను ఎదుర్కొన్న బాహుబలికి రియల్ లైఫ్ లో విలన్లతో తలపడి ఉండరని న్యాయస్థానం తన అభిప్రాయాన్ని వెల్లడించింది. అలాగే ప్రభాస్ భూకబ్జాదారుడన్న ప్రభుత్వ లాయర్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది హైకోర్టు. సామాన్యుడి విషయంలో అయితే అప్పుడే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేవాళ్లమన్న హైకోర్టు.. ప్రభాస్ విషయంలో ఆచితూచి వ్యవహరించామని తెలిపింది.

మామాట: మరి న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందో….

Leave a Reply